Bathing : రోజు చేసేదే అయినా .. స్నానాల్లో ఎన్నిరకాలున్నాయో తెలుసా..? స్నానాలకు అర్ధాలు, ఫలితాలు

స్నానాలకు చాలా చాలా రకాల పేర్లున్నాయనే విషయం మీకు తెలుసా..అసలు ఏఏ సమయాల్లో స్నానం చేయాలి..? ఏఏ సమయాల్లో స్నానం చేయకూడదు..? అస‌లు స్నానం ఎపుడు చేయాలి...? వాటి ఫలితాలు..

Different type bathings

Different type bathings : స్నానం మనిషి రోజు చేసేదే అయినా స్నానం చేసే తీరులో రకరకాలున్నాయి. కొంత కాకి స్నానం చేసేసి మమ అనిపించుకుంటారు.కాకి స్నానం అంటే శరీరం మొత్తం తడకుండా ఏదో చేసాంలే అనిపించుకునేలా హడావిడిగా చేసే స్నాన్నాన్ని కాకి స్థానం అంటారు. కాసిన్ని నీళ్లు కనిపిస్తే చాలు కాకులు స్నానం చేస్తాయి. కానీ వాటి ఈకలు అన్నీ తడకుండానే రెక్కలతో అలా అలా నీళ్లు పోసేసుకుని రివ్వుమని ఎగిరిపోతాయి. అందుకే కాకి స్నానం అని సరదగా అంటారు. కానీ స్నానాల్లో చాలా రకాలున్నాయని చాలామందికి తెలియదు. మరి ఆ స్నానాల పేర్లు ఏంటీ..వాటి విశేషాలేంటో సరదగానే కాదు కాస్త ఇంట్రెస్టింగ్ గా తెలుసుకుందాం..

శరీరం శుభ్రంగా ఉండటానికి నీటితో స్నానం చేస్తాం. శరీరం శుభ్రంగా ఉంటే చర్మ సమస్యలు రావు. అలాగే శరీరం శుభ్రంగా ఉంటే మనస్సు హాయిగా ఉంటుంది. అందుకే స్నానం చేసాక హాయిగా అనిపిస్తుంది.చన్నీటితో స్నానం,గోరువెచ్చని నీటితో స్నానం, వేడి వేడి నీళ్లతో స్నానం ఎన్నో రకాలుగా చేయవచ్చు.గోరువెచ్చని నీటిలో తులసి ఆకులు,వేపాకులు,నిమ్మరసం పిండుకుని వేసుకుని స్నానం చేస్తే శరీర సమస్యలు రావు. క్రమంతప్పకుండా స్నానం చేయటం శారీరక శుభ్రతలో భాగంగా నిర్వహిస్తారు. అటువంటి స్నానంలో చాలా రకాలున్నాయని వాటికి అర్థాలు ఉన్నాయని బహుశా చాలామందికి తెలియదు. మరి ఆ పేర్లేంటో..వాటి అర్థాలేంటో చూద్దాం..

ఏఏ సమయాల్లో స్నానం చేయాలి..? ఏఏ సమయాల్లో స్నానం చేయకూడదు..?
రుషి స్నానం, దేవ స్నానం, మానవ స్నానం, రాక్షస స్నానం,వారుణ స్నానం ఇలా స్నానాలకు చాలా చాలా రకాల పేర్లున్నాయి. అసలు ఏఏ సమయాల్లో స్నానం చేయాలి..? ఏఏ సమయాల్లో స్నానం చేయకూడదు..? అస‌లు స్నానం ఎపుడు చేయాలి…? దాన్నిబట్టి ఉండే ఫ‌లితాలు ఏంటో కూడా తెలుసుకుందాం..

Tattoos : ఇలాంటి టాటులు అస్సలు వేయించుకోవద్దు.. శనిని శరీరంపై డిజైన్ చేయించున్నట్లే!

తెల్లవారుజామున 4-5 గంటల మధ్య స్నానం చేయడం అత్యుత్తమం. దీన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు. పూజలు ఈ బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే మంచిదని అంటారు. అలా తెల్లవారుజామున 4-5 గంటల మధ్య చేసే స్నానాన్ని ‘రుషిస్నానం’ అంటారు. ఇది ప్రధమం. 5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని ‘దేవస్నానం’ అంటారు. ఇది ద్వితయం. 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని ‘మానవ స్నానం’ అంటారు. ఇది అధమం. ఇక 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. ఇది అధమాతి అధమం. కాబట్టి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, రుషిస్నానం చేయడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ఆ సమయంలో చేస్తే మనస్సు చాలా ప్రశాతంగా ఉంటుంది.

ఇక స్నానం చేయటానికి వేడి నీరు కంటే చన్నీటి స్నానం ఉత్తమమైనది. ప్రవాహ ఉదకంలో స్నానం చేయడం చాలా చాలా మంచిది. చెరువులో స్నానం,బావి వద్ద స్నానం ఇలా ఆయా నీటిని బట్టి ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నా స్నానం మాత్రం మానకూడదు. పాచి శరీరంతో ఉండకూడదు. అపరిశుభ్రంగా శరీరం ఉంటే మనస్సు కూడా ప్రశాతంగా ఉండదు. కాబట్టి సమయానికి స్నానం చేయాలని ధర్మశాస్త్రాలు కూడా చెబుతున్నాయి.

మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినదే జలం. అంటే నీరు. జలంతో శుద్ధి చేసుకోవాలి. శుద్ధి అంటే శుభ్రం. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి ఆసక్తికర విశేషాలను మన పూర్వీకులు పొందుపరిచారు. దాంట్లో ‘దివ్య స్నానం’ చాలా అరుదైనదని పురాణాల్లో చెప్పబడింది. దివ్య స్నానం అంటే సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వానలో స్నానం చేయడం ఇది అరుదైనది.

స్నానాలు రకాలు..

మంత్ర స్నానం : మంత్రాలను ఉచ్ఛరిస్తూ చేసే స్నానం ‘మంత్ర స్నానం’..

మానస స్నానం : ఉదయం 6-7 గంటల మధ్య చేయు స్నానం. నారాయణుడిని తలచుకుంటు..కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడమే ‘మానస స్నానం’..దీన్నే మహత్తర స్నానం అంటారు రుషులు. అటువంటి స్నానం చేసినవారు పరమపవిత్రులుగా కొనియాడబడతారు..

భౌమ స్నానం : పుణ్య నదులలో దొరికే మన్ను (మట్టి) లేదా పుట్టమన్ను వంటి మట్టిని ఒంటికి పులుముకుని మనసారా ఈ భూమాతను స్మరిస్తు..మృత్తికా మంత్రాలతో చేసేది ‘భౌమ స్నానం’..

ఆగ్నేయ స్నానం: భస్మ ప్రియుడు పరమశివుడిని స్మరిస్తు..చేసేది ‘ఆగ్నేయ స్నానం’..

వాయువ్య స్నానం : గోమాత పాద ధూళిలో 33 కోట్ల దేవతు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి గోధూళితో చేసేది ‘వాయువ్య స్నానం’..

దివ్య స్నానం: సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వానలో స్నానం చేయడం ‘దివ్య స్నానం’..ఇది అరుదైనది..అపురూపమైనదిగా చెప్పబడుతోంది. ఈ స్నానం చేయాలంటే వాతావరణం కూడా అనుకూలించాలి.

వారుణ స్నానం : పుణ్య నదులలో స్నానం ఆచరించడం‘వారుణ స్నానం’..

క్రియాంగ స్నానం: జపం, మంత్రతర్పణ చేయుటకు చేసే స్నానం..

దైవ స్నానం: ఉదయం 4-5 గంటల మధ్య చేయు స్నానం..

మంత్ర స్నానం: వైదిక మంత్రాలను చదువుతూ చేసే స్నానం..

రుషి స్నానం: ఉదయం 5-6 గంటల మధ్య చేయు స్నానం..

రాక్షస స్నానం : ఉదయం 7 గంటల తరవాత చేసే స్నానం..

ఆతప స్నానం : ఎండలో నిలబడి శరీరాన్ని శుద్ధి చేసుకునే స్నానం..

మలాపకర్షణ స్నానం : శరీరంపై మాలిన్యం పోయేలా అత్యంత శుభ్రంగా చేసే స్నానం..

 

ట్రెండింగ్ వార్తలు