Kidney Stone : కిడ్నీల్లో రాళ్ల సమస్యా? మొక్కజొన్న పొత్తులపై ఉండే పీచుతో!

కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవన శైలి అనుసరించాలి. అలాగే రోజువారిగా తగిన మోతాదులో నీటిని సేవించాలి.

Kidney Stone : మన శరీరంలో మూత్రం సక్రమంగా తయారై ఎప్పటికప్పుడు విసర్జించబడితేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్లు. మూత్రం ద్వారా మన శరీరంలోని మలినాలు ద్రవరూపంలో తొలగిపోతాయి. అయితే కొంత మందిలో మాత్రం కొన్ని రకాల పదార్దాలు మూత్రపిండాల్లో గట్టిగా , చిన్న రేణువుల్లా పేరుగుపోయి రాళ్లుగా మారతాయయి. వీటినే మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడ్డాయని చెప్పుకుంటుంటాం. శరీరం తీరు, జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

మూత్రపిండాల్లో రాళ్లు పొగొట్టుకునేందుకు చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే మూత్రపిండాల్లో రాళ్లను తొలగించటంలో మొక్కజొన్న పొత్తులపై ఉండే పీచు బాగా ఉపకరిస్తుంది. ఇందుకు కోసం మొక్కజొన్న పొత్తులపై ఉండే పీచును 40 గ్రాములు తీసుకోవాలి. అరలీటరు నీళ్లలో ఆయిదు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత పీచును వడకట్టి ఆనీటిని తాగాలి. ఇలా రోజువారిగా చేస్తే మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోతాయి.

అలాగే పల్లేరు కాయల రసం నిత్యం కొద్దిపాటి మోతాదులో తీసుకుంటుంటే రాళ్లు బయటపడతాయి. ఒక టేబుల్ స్పూన్ ఎండబెట్టిన తులసి ఆకులను వేడినీటిలో వేసి, ఆ టీని రోజులో మూడుసార్లు తీసుకోండి. ఇది ఎసిటిక్ ఆమ్లంగా మారి, మూత్రపిండాలలో రాళ్ళను విచ్ఛిన్నం చేయడానికి మీకు సహాయపడుతుంది.

కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవన శైలి అనుసరించాలి. అలాగే రోజువారిగా తగిన మోతాదులో నీటిని సేవించాలి. తక్కువ మోతాదులో నీరు తాగే వారిలో ఈ సమస్య ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే నిపుణులు సూచించిన మోతాదులో నీరు తీసుకోవాలి.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుల సూచనలు , సలహాలు తీసుకోవటం మంచిది.

ట్రెండింగ్ వార్తలు