Pickle : నిల్వపచ్చళ్ళతో ఆరోగ్యానికి ప్రమాదమా..?

గాఢమైన సోడియంసాంధ్రత శరీరంలో ద్రవాభిసరణ సమతుల్యతలని సాధించడానికి నీటినిల్వలని అధిక మోతాదులో నిల్వచేసుకోవాల్సిన పరిస్థితిని కలుగ చేస్తుంది.

Pickle : భోజనంలో ఎన్ని కూరలు వడ్డించినా ఊరగాయ పచ్చడి లేనిది చాలా మందికి ముద్దదిగదు. పచ్చళ్ళంటే ఇష్టపడని వారుండరు. ఆవగాయ, మాగాయ, ఊరగాయ, నిల్వపచ్చళ్లు ఇంట్లో జాడీల్లో నిల్వచేసుకుని పెట్టుకుంటారు. చాలా మంది సమ్మర్‌లోనే సంవత్సరానికి సరిపడినంత పచ్చళ్లు తయారు చేసుకుని నిల్వ చేసుకుంటారు. పచ్ఛళ్ళు ఇంతగా రుచికరంగా ఉండటానికి అందులోవాడే ఉప్పు, కారం, పులుపు, నూనెలు, మసాలాలు, తీపి పదార్దాల సమీకరణాలే…ధీర్ఘకాలం నిల్వ ఉండేందుకు దోహదపడతాయి..ఇటీవలికాలంలో కూరగాయలకి బదులు చేపలు ఇతర మాంసాహారాలతో సైతం పచ్చళ్ళ తయారు చేసి మార్కెట్లలో విక్రయిస్తున్నారు.

పచ్ఛళ్ళను రోజులో కొద్దిగ మాత్రమే తీసుకుంటున్నామని అంతా భావిస్తారు. వాస్తవానికి సంవత్సరాల తరబడి వాటిని వాడడంద్వారా ఆరోగ్యానికి హానికలుగుతుంది. నిల్వపచ్చళ్లలోని ఉప్పునిల్వలలో సోడియం సాంద్రత అధికమొతాదులో ఉంటుంది అది బీపి భాదితులలో బీపి లెవెల్సులో హెచ్చుమార్పులకు కారణం అవుతుంది, అందుకని పచ్చళ్లని వీరు వాడకపోవడం శ్రేయస్కరం. తరచుగా తీసుకొనే ఊరగాయలోని ఉప్పు,కారాలు జీర్ణకోశం చుట్ట్తు అంటిపెట్టుకొనిఉన్న సన్నటిపలుచటి మ్యూకసుపొరని నిరంతరం రాపిడికి గురిచేస్తుంది, జీర్ణవ్యవస్థపై ప్రతికూలప్రబావన్ని తీసుకువస్తుంది. అది కడుపులోమంటలకి, చిన్నప్రేవు వ్యవస్థలో అల్సర్లకు కారణం అవుతుంది.

గాఢమైన సోడియంసాంధ్రత శరీరంలో ద్రవాభిసరణ సమతుల్యతలని సాధించడానికి నీటినిల్వలని అధిక మోతాదులో నిల్వచేసుకోవాల్సిన పరిస్థితిని కలుగ చేస్తుంది. అది శరీరాంగాలలో నీరుగాచేరుతుంది, ఆరొగ్యపరమైన సమస్యలని తీసుకువస్తాయి. ధీర్గకాలం నిల్వచేయడానికి వాడే నూనెలు, అతిసాంద్రతలో సోడియం, ఇతర దినుసులు శరీరంలో ట్రైగ్లిజరైడ్సుల స్థాయిని అందోళనకరస్థాయికి పెంచుతుంది. వెన్నతీసినపెరుగులో కలిపిన ఊరగాయని, పుదీనాలతో తీసుకుంటే అది కొద్దిగా ఉపశమనాన్ని ఇస్తుంది. పచ్చళ్లని, కూరలని నిత్యం తాజాగానే తీసుకోవాలి. నిమ్మరసాన్ని ఉప్పుకి బదులుగా,కారంకి పచ్చిమిర్చిని, పులుపుకి చింతకాయ, పుల్లటి మామిడికాయని ప్రత్యమ్నాయంగా వాడుకోవాలి, అది మీ జిహ్వచాపల్యానికి తృప్తినితెస్తుంది.

పచ్చళ్లు తినే వాళ్లలో ఉదరంలో నొప్పి పెరుగుతుంది.  పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. పచ్చళ్లలో ఉప్పు, నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల అరగడానికి సమయం పట్టడమే కాకుండా, బీపీ, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు వీటిని మితంగా తీసుకోవటమే మంచిది. అంతగా పచ్చళ్ళు తినాలనిపిస్తే అప్పటికప్పుడు రోటీ పచ్చళ్ళు నూరుకుని తినటం మంచిది.

ట్రెండింగ్ వార్తలు