Bigg Boss 7 Day 42 : వైల్డ్ కార్డు ఎంట్రీ.. వచ్చిన మొదటివారమే వెళ్లిపోయిన కంటెస్టెంట్..

నిన్నటి బిగ్‌బాస్ ఆదివారం ఎపిసోడ్ కి భగవంత్ కేసరి ప్రమోషన్స్ కి గాను డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్ శ్రీలీల వచ్చి కాసేపు కంటెస్టెంట్స్ ని ఎంటర్టైన్ చేసి హౌస్ లో సందడి చేశారు.

Bigg Boss 7 Day 42 Highlights eliminations and contestants re entry

Bigg Boss 7 Day 42 : బిగ్‌బాస్ లో ఈసారి అన్ని కొత్తకొత్తగా ట్రై చేస్తున్నారు. ఉల్టా పల్టా అంటూ ఇష్టమొచ్చినట్టు గేమ్స్, టాస్కులు, ఎలిమినేషన్లు చేస్తున్నారు బిగ్‌బాస్ లో. ఇక ఆదివారం ఎపిసోడ్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎలిమినేషన్ కూడా ఉంటుందని తెలిసిందే. నిన్నటి బిగ్‌బాస్ ఆదివారం ఎపిసోడ్ కి భగవంత్ కేసరి ప్రమోషన్స్ కి గాను డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్ శ్రీలీల వచ్చి కాసేపు కంటెస్టెంట్స్ ని ఎంటర్టైన్ చేసి హౌస్ లో సందడి చేశారు. అలాగే పలు ప్రశ్నలు అడిగి వాటికి ఇచ్చే సమాధానాలను బట్టి ఓ చేదు జ్యూస్ అందరితో తాగించారు నాగార్జున.

ఈ మధ్యలోనే ఎలిమినేషన్స్ లో ఉన్న వాళ్ళని కూడా సేవ్ చేసుకుంటూ వచ్చారు. ఈ వారం అమర్ దీప్, తేజ, అశ్వినీ, యావర్, పూజా మూర్తి, శోభా శెట్టి, నయని పావనిలు నామినేష‌న్‌లో ఉన్నారు. వీరిలో తొలి రౌండ్ లో తేజ, యావర్ సేవ్ అయ్యారు. ఆ తర్వాత అమర్ దీప్, శోభాశెట్టి సేవ్ అయ్యారు. అనంతరం పూజా మూర్తి సేవ్ అయింది. చివరగా అశ్విని, నయని పావని మిగలగా వీరిలో నయని పావని ఎలిమినేట్ అయింది.

దీంతో నయనితో పాటు ఆమె అభిమానులు, ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చిన నయని పావని మొదటివారమే ఎలిమినేట్ అవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే నయని మాత్రం ఏడుపు అందుకుంది. నేను బాగానే ఆడినా నన్ను ఎలిమినేట్ చేస్తున్నారు అని బిగ్‌బాస్ ని ప్రశ్నంచి కాసేపు హౌస్ లో హడావిడి చేసింది. అనంతరం స్టేజిపైకి కూడా ఏడ్చుకుంటూ వచ్చింది నయని పావని.

Also Read : Bigg Boss 7 : బిగ్‌బాస్‌లో శ్రీలీల సందడి.. ఆ కంటెస్టెంట్ కాలేజీ జూనియర్ అంటా..

ఇక అల్రెడే ఎలిమినేట్ అయిన వాళ్లలో దామిని, శుభశ్రీ, రతిక.. రీ ఎంట్రీ ఇస్తారని చెప్పి బిగ్‌బాస్ మళ్ళీ ఓ ట్విస్ట్ పెట్టాడు. వాళ్ళల్లో ఒక్కరు మాత్రమే బిగ్‌బాస్ లోకి వస్తారని చెప్పి హౌస్ లో ఉన్న వాళ్ళని ఓటింగ్ చేయమని చెప్పాడు. అయితే ఓటింగ్ అయిన తర్వాత ఎవరికి తక్కువ ఓట్లు వస్తే వాళ్ళు హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తారని చెప్పి అందరికి షాక్ ఇచ్చారు. అయితే ఆ ఓట్లు ఇప్పుడే చూడము అని, బిగ్‌బాస్ తనకి ఇష్టంపొచ్చినప్పుడు చూస్తాడని చెప్పి మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో మరోసారి హౌస్ లోని కంటెస్టంట్స్ అంతా ఆశ్చర్యపోయారు.

ట్రెండింగ్ వార్తలు