Bigg Boss 7 : బిగ్‌బాస్‌లో శ్రీలీల సందడి.. ఆ కంటెస్టెంట్ కాలేజీ జూనియర్ అంటా..

బిగ్‌బాస్‌ హౌస్ లోకి 'భగవంత్ కేసరి' మూవీ టీం ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లోని కంటెస్టెంట్స్ తో శ్రీలీల, అనిల్ రావిపూడి ఇంటరాక్ట్ అవుతూ ఫన్ క్రియేట్ చేశారు. కాగా స్టీ తేజ కాలేజీ చదువుతున్న సమయంలో..

Sreeleela and Anil Ravipudi Fun With BiggBoss season 7 Contestants

Bigg Boss 7 : ఈ సీజన్ బిగ్‌బాస్ కొత్త కొత్త కంటెస్టెంట్స్‌తో, సెలబ్రిటీస్ రాకతో ప్రతి వారం హుషారుగా సాగుతుంది. ఇక వారం బిగ్‌బాస్ చాలా సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ఒక ప్రోమోని రిలీజ్ చేసిన నిర్వాహుకులు.. తాజాగా మరో ప్రోమోని రిలీజ్ చేశారు. మొదటి ప్రోమోలో.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సింగ‌ర్ దామిని, ర‌తిక రోజ్‌, శుభ శ్రీని మళ్ళీ లోపలి తీసుకు వచ్చినట్లు చూపించారు. సెకండ్ ప్రోమోలో హీరోయిన్ శ్రీలీలని, దర్శకుడు అనిల్ రావిపూడిని గెస్ట్‌లుగా తీసుకు వచ్చారు.

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’ అనే సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ మూవీ రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈక్రమంలోనే శ్రీలీల, అనిల్ రావిపూడి.. బిగ్‌బాస్ వేదిక పైకి వచ్చారు. ఇక ఈ ఇద్దరు హౌస్ లోని కంటెస్టెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ.. ఆడియన్స్ కి మంచి ఫన్ ని పంచబోతున్నారు. కాగా కంటెస్టెంట్ టేస్టీ తేజ.. కాలేజీ చదువుతున్న సమయంలో అనిల్ రావిపూడి జూనియర్ అంట.

Also read : Renu Desai : పవన్ కళ్యాణ్‌తో విడాకుల తరువాత.. ఎందుకు పెళ్లి చేసుకోలేదో చెప్పిన రేణూదేశాయ్..

ఈ విషయాన్ని ఈ ప్రోమోలో ఆడియన్స్ కి తెలియజేశారు. ఇక ఇదే ప్రోమోలో అమ‌ర్‌దీప్‌, శ్రీలీలతో పులిహోర కలిపే ప్రయత్నం చేయడం, యావర్ ‘మాస్’ సినిమాలోని నాగార్జున డైలాగ్ చెప్పడం చూపించారు. ప్రోమో అయితే మంచి ఎంటర్‌టైన్మెంట్ గా సాగింది. కాగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సింగ‌ర్ దామిని, ర‌తిక రోజ్‌, శుభ శ్రీ.. అతిథులుగా ఎంట్రీ ఇచ్చారా..? లేదా కంటెస్టెంట్స్ గా వచ్చారా అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే దాని పై కూడా క్యూరియాసిటీ నెలకుంది.

ట్రెండింగ్ వార్తలు