Viraaji : ఆడియన్స్ అట్రాక్షన్ కోసం వరుణ్ సందేశ్‌కి ఆ గెటప్ వేయలేదు.. విరాజి సినిమాపై నిర్మాత..

వరుణ్ సందేశ్ విరాజి సినిమా ఆగస్టు 2 రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత మహేంద్రనాథ్ మీడియాతో మాట్లాడారు.

Producer Mahendra Nath Kondla Interesting Comments on Varun Sandesh Viraaji Movie

Viraaji Producer Mahendra Nath : వరుణ్ సందేశ్ ఇటీవలే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ నింద సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు. త్వరలో ‘విరాజి’ సినిమాతో రాబోతున్నాడు. మహా మూవీస్ తో కలిసి M3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాణంలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో వరుణ్ సందేశ్ హీరోగా విరాజి సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ఆగస్టు 2 రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత మహేంద్రనాథ్ మీడియాతో మాట్లాడారు.

నిర్మాత మహేంద్ర నాథ్ సినిమా గురించి మాట్లాడుతూ.. వరలక్ష్మి శరత్ కుమార్ తో శబరి సినిమా తర్వాత మా సంస్థలో రాబోతున్న రెండో సినిమా విరాజి. టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మన సొసైటీలో ఉన్న ఒక అంశాన్ని తీసుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హారర్ అంశాలు జతచేసి విరాజి సినిమాను నిర్మించాం. హీరో మెయిన్ క్రౌడ్ పుల్లర్ కాబట్టి వరుణ్ సందేశ్ తోనే ఎక్కువ ప్రమోషన్స్ చేస్తున్నాం. ఇంకా రఘు, ప్రమోదిని.. లాంటి పలువురు ఆర్టిస్టులు ఉన్నారు. వరుణ్ గెటప్ కూడా కొత్తగా ఉంటుంది. ఎందుకు అలా ఉంది అనేది సినిమా చూస్తే అర్ధమవుతుంది. ఏదో ఆడియన్స్ అట్రాక్షన్ కోసం ఆ గెటప్ వేయించలేదు. సినిమాలోని పాత్రకు అది సరిపోతుంది అని తెలిపారు.

Also Read : Hassini sudhir : రాజ్ తరుణ్ సినిమా రేపే రిలీజ్.. సినిమా గురించి హీరోయిన్ ఏం చెప్పిందంటే..

అలాగే.. మా ఫ్రెండ్ సుకుమార్ ద్వారా దర్శకుడు ఆద్యంత్ హర్ష పరిచయం అయ్యారు. ఆయన కథ బాగా నేరేట్ చేసారు. చెప్పిన దానికంటే బాగా తెరకెక్కించాడు. అతనికి ఇదే ఫస్ట్ సినిమా. అంతకుముందు కూడా ఎక్కడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేయలేదు. ఇక వరుణ్ సందేశ్ కంటే ముందు ఇంకో ఇద్దరు, ముగ్గుర్ని అనుకున్నాము. నేను కొత్త నిర్మాతను కాబట్టి మాకు హీరోగా నటించి వెళ్లిపోయే వాళ్ళు కాకుండా సినిమా రిలిజ్ అయ్యేవరకు మాతో సినిమాని ప్రమోట్ చేసే హీరో కావాలి. అందుకే వరుణ్ సందేశ్ ని తీసుకున్నాం. అలాగే పాత్ర పరంగా కూడా వరుణ్ కి ఉన్న అమెరికన్ యాక్సెంట్ బాగా సూట్ అవుతుంది. వరుణ్ కూడా కొత్త గెటప్ కోసం బాగానే కష్టపడ్డాడు అని తెలిపారు.

సినిమా రిలీజ్ గురించి మాట్లాడుతూ.. మేము నెల రోజుల ముందే ఆగస్టు 2 వస్తున్నాం అని చెప్పి రిలీజ్ చేస్తున్నాము. మిగిలిన సినిమాలన్నీ ఆ తర్వాతే ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాయి. ప్రతివారం ఎన్ని సినిమాలు వచ్చినా కంటెంట్ ఉన్న సినిమాలే నిలబెడతాయి. విరాజిలో మంచి కంటెంట్ ఉంది. ఇప్పటివరకు సినిమా చూసిన వాళ్లంతా బాగుందని అన్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్లు నైజాంలో రిలీజ్ చేస్తున్నారు. సినిమా చూసి టెక్నికల్ గా కూడా బాగుందని అన్నారు. సెన్సార్ వాళ్ళు కూడా బాగుందని చెప్పారు. సినిమాకు U/A ఇచ్చారు. కేవలం 100 నిమిషాల సినిమా. 100 థియేటర్స్ పైనే విరాజి సినిమా రిలీజ్ అవుతుంది అని తెలిపారు.

ఇక నిర్మాత మహేంద్ర నాథ్ తీయబోయే తర్వాత సినిమాల గురించి మాట్లాడుతూ.. బిగ్ బాస్ అమర్ దీప్, నటి సురేఖవాణి కూతురు సుప్రిత జంటగా లవ్, కమర్షియల్ సినిమా తీస్తున్నాం. 50 శాతం షూట్ అయిపోయింది. ఈ ఏడాది చివర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాము అని తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు