Kiran Rathore : బిగ్‌బాస్ సీజన్ 7లో పన్నెండవ కంటెస్టెంట్.. కిరణ్ రాథోడ్.. హీరోయిన్ నుంచి బోల్డ్ యాక్టర్ వరకు.. అనంతరం సినిమాలకు దూరమయి..

బిగ్‌బాస్ సీజన్ 7లో పన్నెండవ కంటెస్టెంట్ గా సీనియర్ నటి కిరణ్ రాథోడ్(Kiran Rathore) ఎంట్రీ ఇచ్చింది.

Bigg Boss Season 7 Twelfth Contestant Senior Actress Kiran Rathore Full Details Re Entry with Bigg Boss

Kiran Rathore :  తెలుగు పాపులర్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 నిన్న సెప్టెంబర్ 3 ఆదివారం నాడు గ్రాండ్ గా మొదలైంది. ఈసారి కూడా నాగార్జునే (Nagarjuna) బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్ 7 స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో, సెలబ్రిటీ గెస్ట్ లతో గ్రాండ్ గా మొదలైంది. ఇవాల్టినుంచి సోమవారం టు శుక్రవారం.. రాత్రి 9.30 గంటలకు, శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు బిగ్‌బాస్ షో స్టార్ మా (Star Maa) ఛానల్ లో ఎంటర్టైన్ చేయనుంది. అలాగే డిస్నీప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) లో 24 గంటలు లైవ్ స్ట్రీమ్ కానుంది.

ఈసారి బిగ్‌బాస్ సీజన్ 7లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఇందులో కొంతమంది అందరికి తెలిసిన వాళ్ళు ఉండగా కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో మాత్రమే పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళని తీసుకొచ్చారు. బిగ్‌బాస్ సీజన్ 7లో పన్నెండవ కంటెస్టెంట్ గా సీనియర్ నటి కిరణ్ రాథోడ్(Kiran Rathore) ఎంట్రీ ఇచ్చింది.

కిరణ్ రాథోడ్ నటిగా చాలా మందికి పరిచయమే. హిందీ సినిమాలతో ఎంట్రీ ఇచ్చింది ఈ రాజస్థానీ భామ. మొదట హీరోయిన్ గా హిందీ, తమిళ్, మలయాళంలో పలు సినిమాలు చేసింది. అనంతరం తెలుగులో స్పెషల్ సాంగ్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, బోల్డ్ క్యారెక్టర్స్, వ్యాంప్ పాత్రలు చేసుకుంటూ వచ్చింది. అన్ని భాషల్లో కలిపి దాదాపు 50కి పైగా సినిమాలు చేసిన కిరణ్ రాథోడ్ 2016 నుంచి సినిమాలకు దూరంగా ఉంది. తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు కిరణ్ రాథోడ్ పరిచయమే.

Gautham Krishna : బిగ్‌బాస్ సీజన్ 7లో పదకొండవ కంటెస్టెంట్.. గౌతమ్ కృష్ణ.. డాక్టర్ చదివి నటుడిగా మారి..

సినిమాలకు దూరమైనా ఈ 42 ఏళ్ళ భామ కిరణ్ రాథోడ్ సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికి అదే హాట్ ఫోజులతో అలరిస్తుంది. త్వరలో రీ ఎంట్రీకి ప్లాన్ చేయాలనుకుంటుంది కిరణ్ రాథోడ్. అందుకే బిగ్ బాస్ తో ఎంట్రీ ఇచ్చినట్టు సమాచారం. బిగ్ బాస్ తర్వాత మళ్ళీ సినిమాల్లో కెరీర్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తుంది. మరి హౌస్ కిరణ్ రాథోడ్ తన అందాల ప్రదర్శనతో, ఆటతో ఎలా మెప్పిస్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు