Gautham Krishna : బిగ్‌బాస్ సీజన్ 7లో పదకొండవ కంటెస్టెంట్.. గౌతమ్ కృష్ణ.. డాక్టర్ చదివి నటుడిగా మారి..

బిగ్‌బాస్ సీజన్ 7లో పదకొండవ కంటెస్టెంట్ గా డాక్టర్(Doctor), నటుడు గౌతమ్ కృష్ణ(Gautham Krishna) ఎంట్రీ ఇచ్చాడు.

Bigg Boss Season 7 Eleventh Contestant Doctor and Actor Gautham Krishna Full Details

Gautham Krishna :  తెలుగు పాపులర్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 నిన్న సెప్టెంబర్ 3 ఆదివారం నాడు గ్రాండ్ గా మొదలైంది. ఈసారి కూడా నాగార్జునే (Nagarjuna) బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్ 7 స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో, సెలబ్రిటీ గెస్ట్ లతో గ్రాండ్ గా మొదలైంది. ఇవాల్టినుంచి సోమవారం టు శుక్రవారం.. రాత్రి 9.30 గంటలకు, శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు బిగ్‌బాస్ షో స్టార్ మా (Star Maa) ఛానల్ లో ఎంటర్టైన్ చేయనుంది. అలాగే డిస్నీప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) లో 24 గంటలు లైవ్ స్ట్రీమ్ కానుంది.

ఈసారి బిగ్‌బాస్ సీజన్ 7లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఇందులో కొంతమంది అందరికి తెలిసిన వాళ్ళు ఉండగా కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో మాత్రమే పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళని తీసుకొచ్చారు. బిగ్‌బాస్ సీజన్ 7లో పదకొండవ కంటెస్టెంట్ గా డాక్టర్(Doctor), నటుడు గౌతమ్ కృష్ణ(Gautham Krishna) ఎంట్రీ ఇచ్చాడు.

Rathika Rose : బిగ్‌బాస్ సీజన్ 7లో పదవ కంటెస్టెంట్.. రతిక రోజ్.. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తెలుగమ్మాయి..

గౌతమ్ కృష్ణ డాక్టర్ చదివి అనంతరం MBA కూడా చేసి అనంతరం నటుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన గౌతమ్ కృష్ణ హీరోగా ఇటీవల ఆకాశవీధుల్లో అనే సినిమాతో వచ్చాడు. ప్రస్తుతం హీరోగా, నటుడిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. డాక్టర్ నుంచి యాక్టర్ గా మారాడు గౌతమ్ కృష్ణ. ఇప్పుడు ఇలా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రావడంతోనే నేను డాక్టర్ ని హౌస్ లో ఉంటే అందరికి పనికొస్తాను కాబట్టి నన్ను నామినేట్ చేయకండి అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ మొదలుపెట్టాడు. మరి మున్ముందు ఈ డాక్టర్, యాక్టర్ బిగ్ బాస్ లో ఏం చేస్తాడో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు