Chiranjeevi: బాలయ్యతో పాటు చిరంజీవి కూడా సైలెంట్ అవుతాడా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత మెగాస్టార్ నటిస్తున్న మెగా 154 మూవీపై ప్రేక్షకుల్లో ఇప్పటికే అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత మెగాస్టార్ నటిస్తున్న మెగా 154 మూవీపై ప్రేక్షకుల్లో ఇప్పటికే అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది.

Mega154: డబ్బింగ్ పనులు మొదలుపెట్టిన మెగా 154!

అయితే ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కానీ.. ప్రస్తుతం అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇంకా నెలరోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో ఈ సినిమాను ఎప్పుడు పూర్తి చేస్తారా.. ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే సందేహం అందరిలో నెలకొంది. సంక్రాంతి బరిలో ఇప్పటికే తమిళ హీరో విజయ్, ప్రభాస్ తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. వీరితో పాటు చిరంజీవి మెగా 154, నందమూరి బాలకృష్ణ NBK107 చిత్రాలు కూడా రిలీజ్ అవుతాయని అందరూ ఆశించారు.

Mega 154: మెగా 154కు ముహూర్తం ఫిక్స్.. వచ్చేది అప్పుడేనట!

కానీ, బాలయ్య మూవీతో పాటు చిరు సినిమా కూడా షూటింగ్ పెండింగ్ ఉండటంతో ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతాయా లేదా అనే సందేహం నెలకొంది. అయితే, బాలయ్య సంక్రాంతి బరిలో కాకుండా, వేరొక రిలీజ్ డేట్ కోసం చూస్తున్నాడు. ఇప్పుడు ఆయనతో పాటు మెగాస్టార్ కూడా వేరే రిలీజ్ డేట్‌ను చూస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు