Mega154: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మెగా 154’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాలో చిరు ఊరమాస్ అవతారంతో కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ను చిత్ర యూనిట్ వెల్లడించింది.
Mega154: దీపావళి బాంబ్‌ను రెడీ చేస్తోన్న మెగాస్టార్..?
ఈ సినిమా డబ్బింగ్ వర్క్‌ను స్టార్ట్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా తెలిపింది. ఈ మేరకు పూజా కార్యక్రమంతో డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తుండగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ను దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాలో చిరు లుక్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Mega154: “మెగా154″ను భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్!
కాగా, ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఓ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తుండగా, అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుండగా, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.