Mega154: “మెగా154″ను భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్‭ఫ్లిక్స్‭!

ముఠామేస్త్రి తరువాత మళ్ళీ అటువంటి తరహాలో తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమా "వాల్తేరు వీరయ్య". మాస్ అవుట్ మాస్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో తారస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‭ఫ్లిక్స్‭ అదిరిపోయే ఫిగర్ కు కొనుగోలు చేసిందట.

Mega154: ముఠామేస్త్రి తరువాత మళ్ళీ అటువంటి తరహాలో తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమా “వాల్తేరు వీరయ్య”. మాస్ అవుట్ మాస్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో తారస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

Mega154: భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కబోతున్న మెగా 154.. ఫ్యాన్స్ కి కిక్కిస్తున్న తాజా న్యూస్!

చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‭ఫ్లిక్స్‭ అదిరిపోయే ఫిగర్ కు కొనుగోలు చేసిందట. దాదాపు రూ.50 కోట్లు చెల్లించి నెట్‭ఫ్లిక్స్‭ సంస్థ మెగా154 ఓటిటి రైట్స్ ని దక్కించుకోవడంతో.. మెగాస్టార్ స్టామినా ఏంటో మరోసారి రుజువు చేసింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాల్లో మాస్ మహారాజ్ రవితేజ ఒక ముఖ్య పాత్రలో మెరవనున్నాడు. శృతి హాసన్ చిరంజీవికి జంటగా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి ఈ సినిమా థియేటర్ అండ్ డిజిటల్ రైట్స్ ఏ స్థాయిలో అమ్ముడుపోతాయో వేచి చూడాలి.

ట్రెండింగ్ వార్తలు