ఓటుహక్కు వినియోగించుకున్న సజ్జల.. ఎన్నికల ఏర్పాట్లపై ఏమన్నారంటే?

మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రెచ్చగొట్టే కార్యక్రమాలకు ఇతర పార్టీల నేతలు పాల్పడినా సమయమనం పాటించాలని సూచించడం జరిగింది.

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy : వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కచ్చితంగా ఓ మంచి పాలన కొనసాగింపునకు ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. పోలింగ్ ఏర్పాట్లు బాగున్నాయి. ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరగాలి. ప్రజలు తమ ఆకాంక్షలకు అనుగుణంగా ఓటువేసే వాతావరణం కల్పించాలని , ఆమేరకు వైసీపీ శ్రేణుల తరపున సహకారం ఉంటుందని సజ్జల అన్నారు.

Also Read : Allu Arjun : నంద్యాల టూర్‌పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్.. పవన్ గురించి ఏమన్నారంటే?

ఇప్పటికే మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రెచ్చగొట్టే కార్యక్రమాలకు ఇతర పార్టీల నేతలు పాల్పడినా సమయమనం పాటించాలని సూచించడం జరిగింది. జగన్ సూచనలతో పార్టీ కార్యకర్తలుకూడా ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొంటూ.. ప్రశాంత ఎన్నికలకు తమ వంతు సహకారం అందిస్తున్నారని సజ్జల అన్నారు.

Also Read : AP Election 2024 : ఏపీలో ఉత్సాహంగా కొనసాగుతున్న పోలింగ్.. ఉదయం 9గంటల వరకు 12శాతం నమోదు .. Live Updates