Chiranjeevi Birthday Special : చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఎలా వ‌చ్చింది..? ఎవ‌రు ఇచ్చారో తెలుసా..?

కొణిదెల శివశంకర వరప్రసాద్ అంటే అంత త్వ‌ర‌గా గుర్తుప‌ట్ట‌లేక‌పోవ‌చ్చు ఏమో కానీ మెగాస్టార్ చిరంజీవి (Mega star Chiranjeevi) అంటే తెలియ‌ని వారండ‌రు అంటే అతిశ‌యోక్తి కాదేమో.

Chiranjeevi

Chiranjeevi : కొణిదెల శివశంకర వరప్రసాద్ అంటే అంత త్వ‌ర‌గా గుర్తుప‌ట్ట‌లేక‌పోవ‌చ్చు ఏమో కానీ మెగాస్టార్ చిరంజీవి (Mega star Chiranjeevi) అంటే తెలియ‌ని వారండ‌రు అంటే అతిశ‌యోక్తి కాదేమో. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని మొగ‌ల్తూరు గ్రామంలో కొణిదెల వెంకట్రావు-అంజనాదేవిల‌కు మొద‌టి సంతానంగా జ‌న్మించారు. సినిమాల‌పై ఉన్న ఆసక్తితో మ‌ద్రాసు రైలు ఎక్కి ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. కెరీర్ ఆరంభంలో విల‌న్ పాత్ర‌లు పోషించినా ఆ త‌రువాత హీరోగా తిరుగులేని స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే.. చిరంజీవి గురించి ఎప్పుడు ప్ర‌స్తావ‌నా వ‌చ్చిన స‌రే మెగాస్టార్ బిరుదుతో ఆయ‌న్ను పిలుస్తుంటారు. అస‌లు ఆయ‌న‌కు మెగాస్టార్ అనే బిరుదు ఎలా వ‌చ్చింది..? ఎవ‌రు ఇచ్చారు అన్న విష‌యాలు మాత్రం చాలా మందికి తెలియ‌వు. మెగాస్టార్‌కు ముందు చిరంజీవిని అభిమానులు సుప్రీం హీరో అని పిలుచుకునేవారు. ఆయ‌న న‌టించిన పాత సినిమాల్లో ఈ విష‌యాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. కాగా.. ప్ర‌ముఖ నిర్మాత‌ కేఎస్ రామారావు చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చారు.

Chiranjeevi Birthday Special : మెగాస్టార్ కెరీర్‌లో ఇది చాలా మాములు విషయం.. కానీ ప్రతిసారి చిరంజీవి ఇచ్చిన సమాధానం..

చిరంజీవి, కేఎస్ రామారావు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తొలి చిత్రం ‘అభిలాష‌’. బ్లాక్ బాస్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. మొత్తంగా వీరి కాంబినేష‌న్‌లో ఐదు సినిమాలు వ‌చ్చాయి. ‘రాక్షసుడు’, ‘చాలెంజ్’ వంటి సినిమాలు అందులో ఉన్నాయి. కాగా.. నాలుగో సినిమాగా ‘మ‌ర‌ణమృదంగం’ వ‌చ్చింది. ఆ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న చిరంజీవికి సుప్రీం హీరో బిరుదు క‌రెక్ట్ కాద‌ని కేఎస్ రామారావు బావించార‌ట‌.

ఈ క్ర‌మంలో బాగా ఆలోచించి మెగాస్టార్ అనే బిరుదు ఫిక్స్ చేశార‌ట‌. యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది. మ‌ర‌ణ‌మృదంగంలో చిరు ఎంట్రీ సీన్‌లో మెగాస్టార్ చిరంజీవి అని టైటిల్ కార్డు ప‌డుతుంది. ఆ స‌మ‌యంలో సినిమా థియేట‌ర్లు చ‌ప్ప‌ట్లు, కేరింత‌ల‌తో మారుమ్రోగాయి. అలా మొద‌లైన మెగాస్టార్ బిరుదు ఇప్పుడు ఓ బ్రాండ్‌లా మారిపోయింది.

Pawan Kalyan : చిరుకి చిన్న తమ్ముడి విషెస్.. అన్నయ్య గురించి పవన్ ఏమన్నారో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు