Karthikeya2: తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారిగా కార్తికేయ-2.. అసలు విషయమేంటంటే?

తెలుగు హీరో నిఖిల్ నటించిన కార్తికేయ2 అద్భుతమైన విజయం సాధించడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషిలో ఉంది. సక్సెస్ టూర్లు వేస్తూ రోజుకో సిటీలో దర్శనమిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు.తెలుగు సినిమాలను ఇతర భాషల్లో అనువదించాలంటే, అ..ఆ ఇండస్ట్రీస్ కి వెళ్లి అనువదించడంతో దుబ్బింగ్ ఖర్చులు పెరగడంతో పాటు సమయం కూడా వృధా అవుతుంది. ఇలాంటివి అధిగమించడానకి తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారిగా....

Karthikeya2: తెలుగు హీరో నిఖిల్ నటించిన కార్తికేయ2 అద్భుతమైన విజయం సాధించడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషిలో ఉంది. సక్సెస్ టూర్లు వేస్తూ రోజుకో సిటీలో దర్శనమిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే ఈ సినిమా ఇటీవలే 100కోట్ల క్లబ్ లో చోటు దక్కిచుకుంది. చిన్న సినిమాగా వచ్చి ఇంతటి విజయాన్ని అందుకున్నందుకు మూవీ మేకర్స్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Karthikeya 2 : బాలీవుడ్ టాప్ 10 లో కార్తికేయ 2.. సరికొత్త రికార్డ్ సృష్టించిన నిఖిల్..

ముఖ్యంగా ఈ చిత్రానికి నార్త్ లో ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. చందుమొండేటి టేకింగ్, కాలభైరవ నేపథ్య సంగీతం ప్రేక్షకులను కట్టిబడేస్తున్నాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల సినిమా హౌస్ ఫుల్స్ తో నడుస్తోందంటే ఇది ఏ స్థాయి విజయమో అర్ధమవుతుంది. అయితే ఈ చిత్రం తెలుగుతో పాటు ఇతర భాషలో కూడా అనువదించి విడుదల చేసిన సంగతి మనకి తెలిసిందే.

Karthikeya 2 movie : కార్తికేయ 2 సినిమా వంద కోట్ల సెలబ్రేషన్స్

తెలుగు సినిమాలను ఇతర భాషల్లో అనువదించాలంటే, అ..ఆ ఇండస్ట్రీస్ కి వెళ్లి అనువదించడంతో డబ్బింగ్ ఖర్చులు పెరగడంతో పాటు సమయం కూడా వృధా అవుతుంది. ఇలాంటివి అధిగమించడానికి పోస్ట్ ప్రో పాన్ ఇండియా అనే డబ్బింగ్ కంపెనీ హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగింది. దింతో ఏక కాలంలో అన్ని భాషల అనువాదాలు ఒక్కచోటే జరిగిపోతున్నాయి. తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారిగా ఇతర భాషల్లో ఉన్న డబ్బింగ్ కళాకారులను, రచయితలను హైదరాబాద్ కు రప్పించి కార్తికేయ-2 సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగిందని నిర్మాతలు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు