M M Keeravani : కీరవాణికి ఇది ఎన్నో నేషనల్ అవార్డు తెలుసా..? తెలుగులో ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ జాతీయ అవార్డు అందుకున్నారు..?

తెలుగు సినిమా నుంచి ఇప్పటి వరకు ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ నేషనల్ అవార్డుని అందుకున్నారో తెలుసా..? 1967 నుంచి ఇప్పటివరకు ఏఏ సంవత్సరంలో ఏఏ సినిమాకు గాను ఎవరెవరు అవార్డులు అందుకున్నారో ఈ కింద ఉంది చూసేయండి.

M M Keeravani Devi Sri Prasad and telugu music directors who got National Awards from 1967

M M Keeravani : టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి.. ఇటీవల RRR సినిమాలోని నాటు నాటు (Naatu Naatu) సాంగ్ కి ఆస్కార్ అవార్డుని అందుకొని తెలుగు సినిమా చరిత్రలో ఒక చరిత్ర సృష్టించారు. తాజాగా నేడు 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘ఆర్ఆర్ఆర్’ గాను నేషనల్ అవార్డుని అందుకున్నాడు. కీరవాణితో పాటు మరో తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) కూడా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డుని అందుకున్నాడు. పుష్ప (Pushpa 1) సినిమాకి దేవిశ్రీ అవార్డుని అందుకున్నాడు.

Allu Arjun : 69 ఏళ్ళ తెలుగువారి నిరీక్షణ.. అల్లు అర్జున్ నిజం చేసి చూపించాడు..

దేవిశ్రీ ప్రసాద్ నేషనల్ అవార్డు అందుకోవడం ఇదే తొలిసారి. కానీ కీరవాణి మాత్రం ఇంతకు ముందే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా జాతీయ పురస్కారం అందుకున్నారు. 1997 లో నాగార్జున హీరోగా తెరకెక్కిన భక్తిరసా చిత్రం ‘అన్నమయ్య’ సినిమాకి కీరవాణి అవార్డుని అందుకున్నారు. మళ్ళీ 26 ఏళ్ళ తరువాత ఇప్పుడు నేషనల్ అవార్డుని గెలుచుకున్నారు. కాగా తెలుగు సినిమా నుంచి ఇప్పటి వరకు ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ నేషనల్ అవార్డుని అందుకున్నారో తెలుసా..? 1967 నుంచి ఇప్పటివరకు ఏఏ సంవత్సరంలో ఏఏ సినిమాకు గాను ఎవరెవరు అవార్డులు అందుకున్నారో ఈ కింద ఉంది చూసేయండి.

National Film Awards 2023 : RRR కి నేషనల్ అవార్డ్స్ పంట.. తెలుగు విజేతలు వీరే..

1979 – కె.వి.మహదేవన్ (మూవీ – శంకరాభరణం)
1982 – రమేష్ నాయుడు (మూవీ – మేఘసందేశం)
1983 – ఇళయరాజా (మూవీ – సాగర సంగమం)
1988 – ఇళయరాజా (మూవీ – రుద్రవీణ)
1997 – ఎం ఎం కీరవాణి (మూవీ – అన్నమయ్య)
2004 – విద్యాసాగర్ (మూవీ – స్వరాభిషేకం)
2013 – శంతను మొయిత్రా (మూవీ – నా బంగారు తల్లి)
2020 – థమన్ (మూవీ – అల వైకుంఠపురములో)
2021 – ఎం ఎం కీరవాణి (మూవీ – RRR)
2021 – దేవిశ్రీప్రసాద్ (మూవీ – పుష్ప)

ట్రెండింగ్ వార్తలు