Neha Shetty : మొన్న తెలంగాణ వాళ్ళు కనెక్ట్ అయ్యారు.. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కనెక్ట్ అవుతారు.. స్టేజిపై స్పీచ్‌తో రెచ్చిపోయిన నేహశెట్టి..

నేహశెట్టి కార్తికేయ(Karthikeya) సరసన నటించిన బెదురులంక 2012(Bedurulanka) సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో చిత్ర అనే ఓ పక్కా పల్లెటూరి అమ్మాయి క్యారెక్టర్లో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Neha Shetty full Active speech in Bedurulanka 2012 Pre Release Event

Neha Shetty : హీరోయిన్ నేహశెట్టి ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. డీజే టిల్లు(DJ Tillu) సినిమాలో రాధికా క్యారెక్టర్ తో అందర్నీ మెప్పించి ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకుంది. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ కన్నడ భామ. నేహశెట్టి కార్తికేయ(Karthikeya) సరసన నటించిన బెదురులంక 2012(Bedurulanka) సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో చిత్ర అనే ఓ పక్కా పల్లెటూరి అమ్మాయి క్యారెక్టర్లో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

బెదురులంక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేహా శెట్టి మాట్లాడుతూ.. మీ అందరూ డీజే టిల్లు సినిమా చూసి చాలా ఎగ్జైట్ అయ్యారు. అందులో రాధికా క్యారెక్టర్ తెలంగాణ వాళ్లకు బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు బెదురులంక సినిమాలోని చిత్ర క్యారెక్టర్ ఆంధ్ర వాళ్లకు అంతే బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా గురించి నేను చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాను. నన్ను హీరోయిన్ గా తీసుకున్నప్పుడు ఇలాంటి క్యారెక్టర్ నేను చేయలేను అని డైరెక్టర్ ఆలోచించారు. కానీ చేశాను అనుకుంటున్నాను అని తెలిపింది.

Supriya : నేను హీరోయిన్ గా చేస్తా అంటే తాతయ్య వద్దన్నారు.. కానీ పవన్ కళ్యాణ్ తో సినిమా తర్వాత..

నేహశెట్టి కన్నడ భామ అయినా స్టేజిపై తెలుగులో స్పీచ్ అదరగొట్టేసింది. సినిమాకి పనిచేసిన వాళ్ళందరి గురించి తెలుగులోనే మాట్లాడింది. స్టేజిపై ఫుల్ యాక్టివ్ గా, చాలా బాగా మాట్లాడటంతో సినిమాల్లోనే కాదు స్టేజిపై స్పీచ్ తో కూడా అదరగొడుతుంది నేహశెట్టి అని అనుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు