BiggBoss 6 : బిగ్‌బాస్ లో ఇదే మొదటిసారి.. మొదటివారం ఎలిమినేషన్ క్యాన్సిల్.. హమ్మయ్య అనుకున్న కంటెస్టెంట్స్..

ఆదివారం ఎప్పటిలాగే ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలుపెట్టారు నాగార్జున. చివరికి ఇనయ సుల్తానా, అభినయశ్రీ మిగిలారు. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని కంటెస్టెంట్స్, ప్రేక్షకులు అంతా ఉత్కంఠంగా...............

BiggBoss 6 :  బిగ్‌బాస్ సీజన్ 6 ఎట్టకేలకు మొదటివారం పూర్తిచేసుకుంది. ప్రతివారం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారని తెలిసిందే. ఈ సారి కూడా అలాగే నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. మొదటివారం చంటి, రేవంత్‌, శ్రీ సత్య, ఆరోహి, ఇనయా, అభినయశ్రీ, ఫైమా ఎలిమినేషన్‌కి నామినేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే ఆదివారం నాడు ఈ ఎలిమినేషన్ లో ఉన్న వాళ్లలో ఒకర్ని బయటకి పంపించేస్తారు అనుకున్నారు అంతా. కానీ ఈ సారి బిగ్‌బాస్ ఎప్పుడూ లేని ట్విస్ట్ ఇచ్చాడు.

ఆదివారం ఎప్పటిలాగే ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలుపెట్టారు నాగార్జున. చివరికి ఇనయ సుల్తానా, అభినయశ్రీ మిగిలారు. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని కంటెస్టెంట్స్, ప్రేక్షకులు అంతా ఉత్కంఠంగా ఎదురుచూశారు. చివరగా వీరిద్దరిని నాగార్జున గార్డెన్‌ ఏరియాకి పిలిచి అక్కడున్న రెండు భారీ సుత్తులని ఎత్తమన్నారు. ఎవరు సుత్తిని ఎత్తలేకపోతే వారు ఎలిమినేట్ అవుతారు అని చెప్పాడు నాగ్. అయితే ఇద్దరూ సుత్తిలని ఎత్తారు. దీంతో మరోసారి అంతా షాక్ అయి ఎవర్ని ఎలిమినేట్ చేస్తారా అని ఎదురు చూశారు.

అయితే చివర్లో నాగార్జున అందర్నీ సర్‌ప్రయిజ్ చేశారు. ఈ సారి మొదటివారం ఎలిమినేషన్‌ తీసేస్తున్నట్టు ప్రకటించారు నాగార్జున. ఆరు సీజన్లలో మొట్టమొదటి సారి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నాగార్జున ఈ విషయం చెప్పగానే ఇనయా, అభినయశ్రీ ఊపిరి పీల్చుకున్నారు. కంటెస్టెంట్స్ తో పాటు, ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. మొత్తానికి ఈ సీజన్ లో మొదటివారం బిగ్‌బాస్ లో ఎలిమినేషన్ తీసేశారు. దీంతో మొదటివారం ఎవరూ ఎలిమినేట్ అవ్వలేదు.

BiggBoss 6: బిగ్‌బాస్ మొదటి కెప్టెన్సీ పోటీ మొదలు.. నేటి ఎపిసోడ్‌లో ఉత్కంఠ పోరు

ఇక ఆ తర్వాత ఆదివారం గేమ్‌లో మొదటగా `స్టార్‌ ఆఫ్‌ ది వీక్‌` అనే టాస్క్ ఇచ్చాడు నాగార్జున. ఇందులో హౌజ్‌ మేట్స్ గురించి ఎవరు కరెక్ట్ గా, ఎక్కువ సమాధానాలు చెప్తే వాళ్ళు విన్నర్. ఈ గేమ్ లో మొదటి వారం కెప్టెన్‌గా ఎన్నికైన బాలాదిత్య ఎక్కువ సమాధానాలు కరెక్ట్ గా చెప్పి విన్నర్‌గా నిలిచాడు. దీంతో బాలాదిత్యకి బిగ్‌బాస్ ఓ గిఫ్ట్ ని పంపించాడు. అలాగే ఈ టాస్క్ లో హౌస్ లో ఉన్న అమ్మాయిల గురించి చెప్పమనగా బాలాదిత్య ఒక్కఒక్కరికి ఒక్కో పేరు ఇచ్చాడు. మరీనా బుట్టబొమ్మ అని, గీతూ రాయల్‌ సీతమ్మ అని, శ్రీ సత్య పువ్వు అని, ఆరోహి థౌజండ్‌ వాలా అని, వాసంతి బ్యూటిపుల్‌ అని, నేహా స్ప్రింగ్‌ అని, ఫైమా ఎంటర్ టైనర్‌ అని చెప్పాడు.

ఆ తర్వాత హౌస్‌మేట్స్‌తో ‘ఐటమ్‌ నంబర్’ గేమ్‌ ఆడించాడు నాగార్జున. ఓ వస్తువును చూపిస్తే ఆ వస్తువుతో వచ్చే పాట ఏంటో కంటెస్టెంట్స్‌ చెప్పాలి. ఈ గేమ్ కోసం ఇంటిసభ్యులని ఏ, బీ అని రెండు టీమ్‌లుగా విభజించాడు. ఏ టీమ్‌లో చంటి, శ్రీసత్య, రేవంత్‌,నేహా, అభినయ, అర్జున్‌, మెరీనా అండ్‌ రోహిత్‌, కీర్తి, షానీ, ఇనయా ఉండగా మిగిలిన వాళ్ళు బీ టీమ్‌లో ఉన్నారు. ఈ ఆటలో ఏ టీమ్‌ సభ్యలు విజయం సాధించారు. ఎలిమినేషన్ లేకపోవడంతో మళ్ళీ నేడు సోమవారం నుంచి బిగ్‌బాస్ హౌస్ లో 21 మంది గోల తప్పదు.

ట్రెండింగ్ వార్తలు