Prabhas : పౌరాణిక పాత్రల్లో ప్రభాస్.. ఇప్పటికే విశ్వామిత్ర, రాముడు, కృష్ణుడు.. త్వరలో శివుడు, విష్ణువు..?

గతంలో ప్రభాస్ యమదొంగ సినిమాని నిర్మించిన విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ టైటిల్ కోసం విశ్వామిత్ర గెటప్ కూడా వేశాడు. ఈ బ్యానర్ రాజమౌళి ఫ్యామిలీదే. ఆ తర్వాత మిర్చి సినిమాలో ఓ సాంగ్ లో కృష్ణుడి గెటప్ లో కూడా కనిపించాడు ప్రభాస్. ఇక ఆదిపురుష్ లో పూర్తి స్థాయి రాముడి పాత్రలో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే.

Prabhas wants to play mythology Characters already Played in Rama in Adipurush now ready to play Shiva in Bhakta Kannappa Movie

Prabhas Movies : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పౌరాణిక, దేవుడి పాత్రలపై మక్కువ పెంచుకుంటున్నాడా అంటే అవుననే అనిపిస్తుంది. ఇన్నాళ్లు లవర్ బాయ్ గా, మాస్ హీరోగా చేసిన ప్రభాస్ బాహుబలి నుంచి కొత్త కొత్త పాత్రలు చేస్తున్నాడు. బాహుబలిలో రాజులా కనిపించి మెప్పించాడు, సాహోలో హాలీవుడ్ హీరోలా మెప్పించాడు. ఇక ఆదిపురుష్ లో రాముడిలా కనిపించదు. ఇప్పుడు మరో రెండు దేవుడి పాత్రల్లో కనిపించబోతున్నాడని సమాచారం.

మంచు విష్ణు భారీగా తెరకెక్కిస్తున్న భక్త కన్నప్ప సినిమాలో విష్ణు కన్నప్ప క్యారెక్టర్ చేయగా ప్రభాస్ ఈ సినిమాలో శివుడి పాత్ర చేయబోతున్నట్టు సమాచారం. ఇవాళ ఉదయం పలువురు సినిమా పీఆర్ లు ఈ విషయాన్ని పోస్ట్ చేయగా మంచు విష్ణు ఈ విషయాన్ని షేర్ చేసి ఔను అన్నట్టు ఇండైరెక్ట్ గానే చెప్పాడు. దీంతో భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్నాడు అని తెలియడంతో అభిమానులు మొదట షాక్ అయినా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ప్రభాస్ రాబోయే సినిమాల్లో కల్కి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కలియుగం అంతంలో జరిగే కథలా ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ లా తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ మహా విష్ణువు అవతారంలో, కల్కి అవతారంలో కనిపిస్తాడని ఊహా గానాలు ఉన్నాయి. అయితే వీటిని చిత్ర యూనిట్ మాత్రం ఖండించలేదు. దీంతో నిజంగానే కల్కి సినిమాలో ప్రభాస్ విష్ణువు లేదా కల్కి పాతరలో కనిపిస్తాడని అనుకుంటున్నారు.

ఇక గతంలో ప్రభాస్ యమదొంగ సినిమాని నిర్మించిన విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ టైటిల్ కోసం విశ్వామిత్ర గెటప్ కూడా వేశాడు. ఈ బ్యానర్ రాజమౌళి ఫ్యామిలీదే. ఆ తర్వాత మిర్చి సినిమాలో ఓ సాంగ్ లో కృష్ణుడి గెటప్ లో కూడా కనిపించాడు ప్రభాస్. ఇక ఆదిపురుష్ లో పూర్తి స్థాయి రాముడి పాత్రలో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే.

Prabhas : మంచు విష్ణు భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్.. ఆదిపురుష్ లో రాముడు కన్నప్పలో శివుడు..

ఇలా ఇప్పటికే విశ్వమిత్రుడు, కృష్ణుడు, రాముడిగా కనిపించిన ప్రభాస్ ఇప్పుడు శివుడు, విష్ణువు పాత్రల్లో కనిపించబోతున్నాడు. దీంతో ప్రభాస్ కి నిజంగానే పౌరాణిక పాత్రలపై మక్కువ ఉందేమో అని భావిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ తీసినట్టు పౌరాణిక సినిమా తీస్తే ప్రభాస్ కి మంచి క్యారెక్టర్ పడుతుందని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. మరి ప్రభాస్ ఇంకెలాంటి క్యారెక్టర్స్ లో భవిష్యత్తులో కనిపిస్తాడో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు