Guntur Kaaram : టైం, క్వాలిటీ గురించి ఆలోచించి.. గుంటూరు కారం రిలీజ్ చేయడం లేదు.. నిర్మాత నాగవంశీ

టైం అండ్ క్వాలిటీ గురించి ఆలోచించి గుంటూరు కారం సినిమాని రిలీజ్ చేయడం లేదంటూ నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్..

Guntur Kaaram : మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గుంటూరు కారం’. హారికహాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈమధ్య కాలంలో ఈ సినిమా మీద వచ్చిన రూమర్స్ మరే మూవీ పై వచ్చి ఉండవు. హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, రిలీజ్ డేట్ అంటూ ప్రతి విషయం పై ఒక రూమర్. తాజాగా వీటన్నిటికీ నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇస్తూ వస్తున్నాడు.

Also read : Tiger Nageswara Rao : టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా ఆడియన్స్‌కి మాత్రమే కాదు.. వారికి కూడా.. రవితేజ ది గ్రేట్..

ఈక్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ చిత్రం సంక్రాంతికి కచ్చితంగా వస్తుంది. నాన్ రాజమౌళి సినిమా కలెక్షన్స్ రికార్డుల్లో గుంటూరు కారం మొదటి ప్లేస్ దక్కించుకుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టైం అండ్ క్వాలిటీ గురించి ఆలోచించి ఈ సినిమాని కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తున్నాము. తమిళంలో గాని ఇతర లాంగ్వేజ్స్ లో గాని డబ్ చేయడం లేదని వెల్లడించాడు. దీంతో గుంటూరు కారం ఒక్క తెలుగు బాషలోనే రిలీజ్ కాబోతుందని ఒక క్లారిటీ వచ్చేసింది.

Also read : Maama Mascheendra : మామా మశ్చీంద్ర మూవీ రివ్యూ.. మూడు పాత్రలతో సుధీర్ బాబు మెప్పించాడా?

కాగా ఈ మూవీ నుంచి ఒక సాంగ్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ కోరికను నెరవేరుస్తూ మేకర్స్ దసరాకి ఒక మెలోడీ లవ్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మహేష్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేకపోయాయి. మరి ఈసారైనా బ్లాక్ బస్టర్ ని నమోదు చేసి నిర్మాత అన్నట్లు.. నాన్ రాజమౌళి సినిమా కలెక్షన్స్ రికార్డుని సెట్ చేస్తాడో లేదో చూడాలి.

 

 

ట్రెండింగ్ వార్తలు