Natti Kumar : పెంచిన టికెట్ రేట్లపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తా – నట్టి కుమార్..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీ థియేటర్ల టికెట్ రేట్లు భారీగా పెంచడంతో చిన్న సినిమాలకు తీవ్ర అన్యాయం జరిగింది - నట్టి కుమార్..

Natti Kumar: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీ థియేటర్ల టికెట్ రేట్లు భారీగా పెంచడంతో చిన్న సినిమాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రముఖ నిర్మాత, దర్శకుడు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

Nikhil Siddhartha : ఏపీలో థియేటర్ల పరిస్థితిపై గళమెత్తిన మరో యంగ్ హీరో..

‘‘ఈ నెల 21న తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు అధికంగా పెంచుతూ G.O. 120 విడుదల చేసింది. ఈ కొత్త జీవో మా చిన్న నిర్మాతలను పూర్తిగా నిరాశ పరిచింది. ఎప్పట్నుంచో చిన్న సినిమాల కోసం ప్రత్యేకంగా ఒక షో అడుగుతున్నాం. దానిని 5వ షోగా పరిగణిస్తూ అనుమతి ఇవ్వాలని చాలా కాలంగా చిన్న నిర్మాతలంతా కోరుతున్నప్పటికీ, ఆ ఊసే లేకపోవడం కలవరానికి గురి చేసింది. అలాగే మల్టీప్లెక్స్‌లలో సినిమాటోగ్రఫీ యాక్ట్ 1955 ప్రకారం పేదవాడు సినిమా చూడటం కోసం సీటింగ్ కెపాసిటీలో 10 శాతం కేటాయించాలి.

Vijay Deverakonda : తెలంగాణ సర్కార్ ఇండస్ట్రీ బాగును కోరుకుంటోంది..

టికెట్ల రేట్లను పేదవాడి కోసం కనిష్టంగా 50 రూపాయలు నిర్ణయించాలి. కానీ అలాంటి నిబంధనలు ఈ నూతన జీవోలో అసలు లేనే లేవు. మల్టీప్లెక్స్‌లలో సినిమా చూడాలన్న కల బయట నుంచి బిల్డింగ్ చూడటానికే పరిమితమవుతోంది తప్ప లోపలికి వెళ్లి సినిమా చూసే కల కలగానే మిగిలి పోనుంది. ఇక నూతన జీవోలో పెంచిన టికెట్ల రేట్లు డబుల్ అయ్యాయి. మల్టీప్లెక్స్‌లలో 300/- 250/- 150/-, సింగల్ థియేటర్లలో 150/- 50/- రూపాయలుగా పెంచిన రేట్లు ఉన్నాయి. సీ క్లాస్ దాకా ఇవే పెట్టారు.

Anil Ravipudi : ఏపీ థియేటర్స్ విషయంలో అయోమయంగా ఉంది..

పెద్ద సినిమాకు, చిన్న సినిమాకు ఒకేవిధంగా టికెట్ల రేట్లు ఉంటే చిన్న సినిమా మనుగడ ఎలా సాధ్యమవుతుంది. ఇప్పటివరకు ఉన్న టికెట్ల రేట్లకే హైదరాబాద్ సిటీలో థియేటర్ల రెంట్లు 8 లక్షలు నుంచి 9 లక్షలకు పైగా ఉన్నాయి. అయినా థియేటర్లు నిజమైన ఎగ్జిబిటర్ల ఆధ్వర్యంలో ఎక్కడ నడుస్తున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాలలోని థియేటర్లు ఇద్దరే ఇద్దరు ఏషియన్ సునీల్, దిల్ రాజు చేతుల్లోనే ఉన్నాయి. వాళ్లిద్దరికి మాత్రమే మేలు జరుగుతోంది.

Siddharth : దోచుకుంటోంది రాజకీయ నేతలే..! ముందు మీ అవినీతి తగ్గించుకోండి

తెలుగు చిత్ర పరిశ్రమలో 95 శాతం టెక్నీషియన్లు చిన్న సినిమాల మీద బతుకుతున్నారు. పరిశ్రమలో అధికంగా నిర్మాణమయ్యేవి చిన్న సినిమాలే. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చిన్న సినిమాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. పేదల పక్షం వహించే వీరిద్దరూ ఎక్కడో లాజిక్ మిస్ కావడం వల్లే చిన్న సినిమాలకు ఇలా అన్యాయం జరిగిందని భావిస్తున్నాను. పది రోజుల్లోగా చిన్న సినిమాలకు మేలు చేసే నిర్ణయం వారు తీసుకోకపోతే లీగల్‌గా నేను తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తా’’ అన్నారు నట్టి కుమార్.

ట్రెండింగ్ వార్తలు