Yash New Look with Less Beard goes Viral while He came for Voting in Elections
Yash : KGF సినిమాలతో పాన్ ఇండియా స్టార్ డమ్ సంపాదించుకున్నాడు యశ్. ఆ సినిమాలతో కన్నడ సినీ పరిశ్రమ స్థాయి కూడా పెరిగింది. దీంతో యశ్ నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యశ్ నెక్స్ట్ సినిమా ‘టాక్సిక్’ కొన్ని నెలల క్రితం అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా వర్క్ జరుగుతుంది.
అయితే యశ్ KGF సినిమాలో ఫుల్ గడ్డంతో కనపడిన సంగతి తెలిసిందే. సినిమా అయిపోయాక కూడా ఆ గడ్డం తీయలేదు. ఇన్ని రోజులు ఫుల్ గడ్డంతోనే కనపడ్డాడు యశ్. కానీ తాజాగా ఇవాళ గడ్డం కొంచెం తగ్గించి యశ్ కొత్త లుక్ లో కనపడ్డాడు. నేడు కర్ణాటకలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండటంతో యశ్ ఓటు వేయడానికి వచ్చాడు. దీంతో యశ్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Also Read : Anupama Parameswaran : ‘పరదా’ తీసేసిన అనుపమ పరమేశ్వరన్.. టిల్లు స్క్వేర్ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమా..?
యశ్ గడ్డం తగ్గించి ఇంకొంచెం స్టైల్ గా మారి, కళ్ళజోడు పెట్టి సరికొత్త లుక్ లో కనపడ్డాడు. దీంతో ఇది టాక్సిక్ సినిమా లుక్ అని అభిమానులు భావిస్తున్నారు. టాక్సిక్ సినిమా అనౌన్స్ గ్లింప్స్ లో కూడా యశ్ గడ్డంతో కనిపించడంతో ఇది కచ్చితంగా టాక్సిక్ సినిమా లుక్ అని అంటున్నారు. చాలా రోజుల తర్వాత యశ్ ని ఓ కొత్త లుక్ లో చూడటంతో అభిమానులు సంతోషిస్తూ యశ్ ఫొటోలు వైరల్ చేస్తున్నారు.
— Manobala Vijayabalan (@ManobalaV) April 26, 2024