Anupama Parameswaran : ‘పరదా’ తీసేసిన అనుపమ పరమేశ్వరన్.. టిల్లు స్క్వేర్ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమా..?

టిల్లు స్క్వేర్ సక్సెస్ లో ఉన్న అనుపమ తన నెక్స్ట్ సినిమాని నేడు ప్రకటించింది.

Anupama Parameswaran : ‘పరదా’ తీసేసిన అనుపమ పరమేశ్వరన్.. టిల్లు స్క్వేర్ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమా..?

Anupama Parameswaran Next Movie Paradha Concept Video Released

Updated On : April 26, 2024 / 5:32 PM IST

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ ఇటీవలే టిల్లు స్క్వేర్ తో భారీ 100 కోట్ల హిట్ కొట్టింది. వరుస సినిమాలతో, సోషల్ మీడియాలో వరుస పోస్టులతో అనుపమ ఫుల్ ఫామ్ లో ఉంది. ఎప్పటికప్పుడు అనుపమ ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటుంది. టిల్లు స్క్వేర్ సక్సెస్ లో ఉన్న అనుపమ తన నెక్స్ట్ సినిమాని నేడు ప్రకటించింది.

అనుపమ లేడీ మల్టీస్టారర్ సినిమా చేస్తుంది. ‘సినిమా బండి’ ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్, మలయాళీ హీరోయిన్ దర్శన రాజేంద్రన్, సీనియర్ నటి సంగీత ముఖ్య పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇద్దరు కథానాయికలతో ప్రేమ పేరుతో అమ్మాయిలకు ఆంక్షలు, ట్రావెలింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని సమాచారం. తాజాగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ అనుపమ ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Also Read : Faria Abdullah : నా అంత హైట్ లేకపోయినా పర్లేదు.. ఫరియా అబ్దుల్లాకు ఎలాంటి భర్త కావాలంటే..?

ఈ సినిమాకు ‘పరదా’ అనే ఆసక్తికర టైటిల్ ని ప్రకటించారు. ఈ గ్లింప్స్ లో మొదట అమ్మవారి కళ్ళకు గంతలు కట్టి ఉన్నట్టు చూపించి ఆ తర్వాత అనుపమ చుట్టూ ఉన్న వాళ్లంతా ముఖంపై ముసుగులు వేసుకొని ఉంటే అనుపమ ముఖంపై ముసుగు తీసేస్తూ ఉంది. ఇక ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః.. శ్లోకం వినిపిస్తుంది. దీంతో ఈ గ్లింప్స్ వైరల్ గా మారింది. ఈ టైటిల్ గ్లింప్స్ తోనే ఇదేదో కొత్త కథ అని ఆసక్తి కలిగించారు. ఈ సినిమాతో దర్శన తెలుగులో పరిచయం కాబోతుంది. ప్రస్తుతం హిమాలయాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నట్టు సమాచారం.