Faria Abdullah : నా అంత హైట్ లేకపోయినా పర్లేదు.. ఫరియా అబ్దుల్లాకు ఎలాంటి భర్త కావాలంటే..?
ప్రమోషన్స్ లో భాగంగా ఫరియా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Faria Abdullah Interesting Comments about her Feature Husband
Faria Abdullah : ఫరియా అబ్దుల్లా థియేటర్ ఆర్టిస్ట్ నుంచి సినిమా హీరోయిన్ గా మారిన హైదరాబాద్ అమ్మాయి. జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే పెద్ద హిట్ కొట్టి అందరితో తమ చిట్టి అనిపించుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ లు, హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. త్వరలో అల్లరి నరేష్(Allari Naresh) సరసన ఆ ఒక్కటి అడక్కు(Aa Okkati Adakku) సినిమాతో రాబోతుంది.
అయితే ఫరియా అబ్దుల్లా హైట్ ఎక్కువ. ఇప్పుడు ఉన్న చాలా మంది హీరోల కంటే ఫరియా హైట్ ఎక్కువే. సినిమాల్లో హీరో పక్కన ఆ హైట్ కవర్ చేయడానికి దర్శకులు ట్రై చేస్తారు. దీంతో ఫరియా హైట్ గురించి ప్రతిసారి చర్చ జరుగుతుంది. మే 3న అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు సినిమా రిలీజ్ కాబోతుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఫరియా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Also Read : Tollywood Actress : ఈ క్యూట్ పాపని గుర్తు పట్టారా? వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న హీరోయిన్.. ఎవరో తెలుసా?
యాంకర్ మీకు ఎలాంటి భర్త కావాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని అడగ్గా.. ముఖ్యంగా ఫన్ ఉండాలి. ఫన్ ఉంటే హైట్ లేకపోయినా పర్లేదు. లైఫ్ లో చాలా బాధలు ఉంటాయి కాబట్టి జోకులు వేయడం, లైఫ్ జోవియల్ గా ఉంచాలి అని తెలిపింది. అయితే ఫరియా ఎక్కువ హైట్ ఉండటం, కాబోయే భర్త ఫన్ గా ఉంటే చాలు హైట్ లేకపోయినా పర్లేదు అని చెప్పడంతో ఫరియా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.