Chandramukhi 2 : చంద్రముఖి టీంకి రజినీకాంత్ లెటర్.. ఏం రాశాడో తెలుసా..?

రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. తాజాగా ఈ మూవీ టీంకి రజినీకాంత్ ఒక లెటర్ రాశాడు.

Rajinikanth surprise love note for Raghava Lawrence Chandramukhi 2 team

Chandramukhi 2 : సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా 2005లో ఆడియన్స్ ముందుకు వచ్చిన హర్రర్ కామెడీ మూవీ ‘చంద్రముఖి’. పి.వాసు డైరెక్ట్ చేసిన మూవీలో ‘జ్యోతిక’ చంద్రముఖిగా నటించింది. అప్పటిలో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇన్నాళ్లు తరువాత ఆ మూవీకి ఇప్పుడు సీక్వెల్ ని తీసుకు వచ్చాడు దర్శకుడు వాసు. అయితే ఈ మూవీలో హీరోగా రజినికి బదులు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ని తీసుకున్నాడు. ఇక చంద్రముఖిగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) నటించింది.

Baby Movie : బేబీ దర్శకుడికి కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రొడ్యూసర్.. తన నెక్స్ట్ సినిమా కూడా..

ఈ మూవీ సెప్టెంబర్ 28న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యింది. కాగా నేడు చిత్ర యూనిట్ కి రజినీకాంత్ నుంచి ఒక సర్‌ప్రైజింగ్ లెటర్ వచ్చింది. ఆ లెటర్ రజిని.. “నా మిత్రుడు వాసు తన బిగ్గెస్ట్ హిట్ చంద్రముఖిని కొత్త యాంగిల్‌లో, భారీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంగా సినీ అభిమానులకు చంద్రముఖి 2 ద్వారా అందించాడు. వాసు గారికి, రాఘవ లారెన్స్ గారికి, చిత్రబృందం అందరికీ నా శుభాకాంక్షలు” అంటూ పేర్కొన్నాడు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాతలు ఆ లెటర్ ని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Vijay Antony : కూతురు మరణం నుంచి కోలుకుంటున్న విజయ్ ఆంటోనీ.. పాన్ ఇండియా మూవీతో..

లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కించాడు. ఆస్కార్‌ అవార్డు గ్ర‌హీత ఎంఎం కీర‌వాణి ఈ సినిమాకి సంగీతం అందించాడు. కాగా ఈ సీక్వెల్ మొదటి మూవీ అంతా లేదన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. అసలు ఈ సీక్వెల్ లో ఎక్కడా భయం కలిగే సీన్స్ లేవని, ఒకసారి తీసిన సినిమానే మళ్ళీ తీసి మనకి చంద్రముఖి 2 అని చుపించారంటూ టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం నెగటివ్ టాక్ తో రన్ అవుతున్న ఈ మూవీ ఫుల్ రన్ ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.

 

ట్రెండింగ్ వార్తలు