RGV : అందుకే ఆదిపురుష్ పై ట్రోల్స్.. వాళ్ళ ఖర్మకి వాళ్ళే పోతారు..

ఆర్జీవీ మాట్లాడుతూ..''ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు కూడా VFX బాగోలేదని చాలా మంది ట్రోల్ చేశారు. కానీ సినిమా వచ్చాక ఎవరూ దాని గురించి మాట్లాడలేదు. కాబట్టి ఒక నిమిషం వీడియో చూసి సినిమాని జడ్జ్ చేయకూడదు. రామాయణం అంటే...........

RGV :  ప్రభాస్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆదిపురుష్ అప్డేట్ ఇటీవల ఇచ్చేశారు. అక్టోబర్ 2న ఆదిపురుష్ రిజర్ రిలీజ్ చేయగా చూడటానికి విజువల్ గా బాగున్నా దీనిపై విమర్శలు భారీగా వస్తున్నాయి. ఈ సినిమాని రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నామని, ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా కనిపించబోతున్నారని ఇప్పటికే చిత్ర యూనిట్, దర్శకుడు ఓం రౌత్ ప్రకటించారు.

టీజర్ రిలీజ్ అయిన తర్వాత దాంట్లో రామాయణం కనపడకపోగా, అదొక గ్రాఫిక్స్, హాలీవుడ్ సినిమాలాగా ఉండటంతో అటు ప్రభాస్ అభిమానుల నుండి, ఇటు హిందువుల నుండి టీజర్ పై, సినిమాపై, డైరెక్టర్ పై విమర్శలు, ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి. ఈ విషయంపై పలువురు ప్రముఖులు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. తాజాగా ఆదిపురుష్ పై వచ్చే ట్రోల్స్ మీద ఆర్జీవీ స్పందించారు.

ఇటీవల ఆర్జీవీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆదిపురుష్ ట్రోల్స్ గురించి మాట్లాడారు. ఆర్జీవీ మాట్లాడుతూ..”ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు కూడా VFX బాగోలేదని చాలా మంది ట్రోల్ చేశారు. కానీ సినిమా వచ్చాక ఎవరూ దాని గురించి మాట్లాడలేదు. కాబట్టి ఒక నిమిషం వీడియో చూసి సినిమాని జడ్జ్ చేయకూడదు. రామాయణం అంటే ఇలాగే ఉంటుందని మనకి ఒక అవగాహన ఉంది. అంతకుముందు వచ్చిన సినిమాలన్నీ చూసి మనం రామాయణం అలాగే ఉంటుందనుకుంటున్నాం. సడెన్ గా రాముడు, రావణాసురుడు, హనుమంతుడు.. ఇలా మనకి తెలిసిన పాత్రలని కొత్తగా చూసేసరికి మనకి నచ్చట్లేదు. నిజం చెప్పాలంటే నాకు కూడా రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ గెటప్ నచ్చలేదు. చిన్నప్పట్నుంచి ఎస్వీ రంగారావు, ఎన్టీఆర్ లాంటి గొప్ప వాళ్ళని రావణాసురుడిగా చూసిన తర్వాత ఇదేంటి ఇలా ఉంది అని అనుకున్నాను.”

Adipurush Movie : ఆదిపురుష్ రిలీజ్ చేయనివ్వం.. బుద్ధి చెప్పాల్సిందే.. మహారాష్ట్ర ఎమ్మెల్యే..

”దర్శకనిర్మాతలు అన్ని వందల కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీస్తున్నారంటే ఏదో కొత్తగా ప్రేక్షకులకి చూపించడానికి ట్రై చేస్తున్నారు. వాళ్లకు అడ్డుపడే హక్కు మనకి లేదు. ఒకవేళ వాళ్ళ ఆలోచన తప్పైతే వాళ్ళే అనుభవిస్తారు. అంతే కానీ ఇలా ట్రోల్స్ చేయాల్సిన అవసరం లేదు. అయినా ముందునుంచి చిత్ర యూనిట్ రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నాం అని చెప్పడం వల్లే ఈ ట్రోల్స్ వస్తున్నాయి. ఇదొక ఫిక్షనల్ స్టోరీ, కేవలం రామాయణం కథని బేసిక్ నాలెడ్జిగా తీసుకున్నాం. ఇందులో పాత్రలు కొత్తగా ఉంటాయి అని ముందే చెప్తే ఈ ట్రోల్స్ వచ్చేవి కావు. అలాగే ఆదిపురుష్ టీజర్ చూశాక ఇది యానిమేటెడ్ అని ఎవరూ ఊహించకపోవడంతో కూడా ఈ ట్రోల్స్ వస్తున్నాయని” అన్నారు.

ట్రెండింగ్ వార్తలు