Shahrukh Khan will play guest role in Rajamouli Mahesh Babu SSMB29 Movie rumours goes viral
Rajamouli Mahesh Babu Movie : పెద్దగా సోషల్ మీడియాలో ఎవరి గురించీ రెస్పాండ్ అవ్వని మహేశ్, ఏదైనా విషయం ఉంటే తప్ప, ఏ సినిమా గురించీ సోషల్ మీడియాలో చెప్పని రాజమౌళి.. ఇద్దరూ కలిసి సడెన్ గా జవాన్(Jawan) జపం చేస్తున్నారు. మహేశ్ బాబు, రాజమౌళి సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచే హైప్ క్రియేట్ అయ్యింది. యాక్షన్ అడ్వెంచర్ అని, ఇండియానా జోన్స్ స్టైల్ అని రకరకాలుగా సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు రాజమౌళి అండ్ టీమ్. హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉంటారని, పాన్ హాలీవుడ్ రిలీజ్ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.
అయితే ఈ సినిమాకి అంతకుమించిన యాడెడ్ ఎట్రాక్షన్, అసలు సినిమాకే హైలైట్ అవ్వబోతున్నారు అంట షారూఖ్ ఖాన్(Shahrukh Khan). ప్రస్తుతం వీళ్ల ముగ్గుర్నీ చూస్తే అది జరగడం పక్కా అంటున్నారు ఫాన్స్. మహేశ్, రాజమౌళి సినిమాలో షారూఖ్ ఖాన్ నటిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో రూమర్స్ బాగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. అటు రాజమౌళి, మహేశ్, ఇటు షారూఖ్ ఖాన్.. ముగ్గురూ సోషల్ మీడియాలో చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఒకరి గురించి ఒకరు పొగుడుకోవడం, ఇంప్రెసివ్ గా థాంక్స్ చెప్పుకోవడం, కలిసి ఇంకా కష్టపడదాం అంటూ షారూఖ్ ఖాన్ అనడం చూస్తే.. రాజమౌళి, మహేశ్ సినిమాలో షారూఖ్ ఖాన్ గ్యారంటీ గా యాక్ట్ చేస్తాడని అనుకుంటున్నారంతా.
Aadikeshava : సిత్తరాల సిత్రావతి వచ్చేసింది.. ఆదికేశవ కోసం శ్రీలీల మాస్ స్టెప్పులు
ఈ గురువారం ధియేటర్లోకొచ్చిన జవాన్ మూవీ కి బెస్ట్ విషెస్ చెబుతూ మహేశ్ ట్వీట్ చెయ్యడం, ఆ ట్వీట్ కి షారూఖ్ రిప్లై ఇవ్వడం, సినిమా చూసిన తర్వాత కూడా మహేశ్.. జవాన్ ఆహా.. ఓహో.. సూపర్ అంటూ సోషల్ మీడియాలో తెగ పొగిడేశాడు. దానికి షారూఖ్ ఖాన్ కూడా అంతే స్వీట్ గా రిప్లై ఇచ్చారు. ఈ గ్యాప్ లో రాజమౌళి కూడా జాయిన్ అయి ఇంత గొప్ప యాక్షన్ మూవీ నేనీ మధ్యలో చూడలేదు అంటూ మెచ్చుకుంటూ జక్కన్న పోస్ట్ పెట్టాడు. అసలు ప్రమోషన్స్ కి, పర్సనల్ ఫోటోస్ కి తప్ప పెద్దగా సోషల్ మీడియా వాడని మహేశ్, రాజమౌళి.. ఇలా షారూఖ్ ఖాన్ జవాన్ చుట్టూ పోస్టులు, కామెంట్లతో పలకరించడం, దానికి షారూఖ్ ఖాన్ కూడా పొంగిపోవడం చూస్తుంటే.. ముగ్గురూ ఏదో పెద్ద ప్లానే వేస్తన్నారు అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే రాజమౌళి, మహేశ్ సినిమాలో షారూఖ్ ఖాన్ ని కూడా దింపుతున్నారు అంటూ టాక్ బాగా వైరల్ అవుతోంది. చూడాలి మరి.. ఇదే కనక నిజమైతే ఇండియన్ బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే.
Thank u so much. Everyone is so thrilled you liked it. Big love to you and family. Very encouraging to hear your kind words. Will keep working harder now to entertain. Love you my friend. https://t.co/won5gxilR7
— Shah Rukh Khan (@iamsrk) September 8, 2023
Thank u so much sir. We are all learning from your creative inputs for cinema. Please see it as and when u can. Then call me to tell me if I can be a mass hero also. Ha ha. Love and regards sir. https://t.co/RpI0UZ625a
— Shah Rukh Khan (@iamsrk) September 8, 2023