Namrata Shirodkar special post on Sitara Ghattamaneni birthday
Sitara Ghattamaneni – Namrata Shirodkar : సూపర్ స్టార్ మహేశ్‌బాబు కూతురు సితార పుట్టినరోజు నేడు. 2024 జూలై 20న సితార 12వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఆమె పుట్టిన రోజు వేడులకను ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను నమ్రతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘అందమైన కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు కనే కలలు నిజం అవ్వాలని కోరుకుంటున్నారు. నీ మనసు బంగారం తల్లీ.’ అంటూ ఆ ఫోటో కింద రాసుకొచ్చింది.
కాగా.. ఈ ఉదయమే సితారకు మహేశ్ బాబు, నమ్రతలు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘హ్యాపీ 12 మై సన్‌షైన్’ అని మహేశ్ పోస్ట్ చేశారు. నమ్రత ఇన్‌స్టా వేదికగా ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు. సితార చిన్నప్పటి ఫొటోలు, వీడియోలతో దీనిని క్రియేట్ చేశారు. ‘నా చిట్టి ప్రయాణ సహచరురాలికి జన్మదిన శుభాకాంక్షలు. వివిధ దేశాలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. నువ్వు ఎల్లప్పుడూ నాకొక ట్రావెల్ గైడ్‌లా ఉంటూ ప్రతి ప్రయాణాన్ని ప్రత్యేకం చేశావు. ఈ క్షణాలు, జ్ఞాపకాలను సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఐ లవ్ యూ మై స్వీట్‌హార్ట్’’ అని రాసుకొచ్చింది.
ఇదిలా ఉంటే.. సితార తరచూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటుంది. ఇటీవల ఓ నగల దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది. దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని సైతం సేవల కోసమే ఉపయోగించి తన మంచి మనసును చాటుకుంది.