Trivikram – Vijay Bhaskar : హాట్ హీరోయిన్‌తో గురు శిష్యులు.. ఫొటో వైరల్.. ఒక్క ఫొటోతో ఆ రూమర్స్‌కు క్లారిటీ ఇచ్చిన త్రివిక్రమ్..

విజయ్ భాస్కర్ - త్రివిక్రమ్ కి గొడవలు వచ్చాయని, వారిద్దరూ దూరమయ్యారని వార్తలు వచ్చాయి.

Trivikram – Vijay Bhaskar : హాట్ హీరోయిన్‌తో గురు శిష్యులు.. ఫొటో వైరల్.. ఒక్క ఫొటోతో ఆ రూమర్స్‌కు క్లారిటీ ఇచ్చిన త్రివిక్రమ్..

Actress Seerat Kapoor Shares Photo with Director Trivikram and Vijay Bhaskar Photo goes Viral

Updated On : July 20, 2024 / 12:33 PM IST

Trivikram – Vijay Bhaskar – Seerat Kapoor : త్రివిక్రమ్ కెరీర్ మొదట్లో విజయ్ భాస్కర్ సినిమాలకు రచయితగా పనిచేసిన సంగతి తెలిసిందే. విజయ్ భాస్కర్ దర్శకుడిగా సాధించిన విజయాల్లో త్రివిక్రమ్ భాగం కూడా ఉంటుంది. అయితే కొన్నేళ్ల నుంచి త్రివిక్రమ్ విజయ్ భాస్కర్ దగ్గర పనిచేయట్లేదు. దీంతో విజయ్ భాస్కర్ కెరీర్ కూడా పడిపోయింది. ఈ విషయంలో విజయ్ భాస్కర్ – త్రివిక్రమ్ కి గొడవలు వచ్చాయని, వారిద్దరూ దూరమయ్యారని వార్తలు వచ్చాయి.

ఇటీవల విజయ్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో అలాంటిదేమి లేదని, ఎవరి కెరీర్ వాళ్ళు చూసుకోవడంతో బిజీ అయి కలవట్లేదని, త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ అయినందుకు సంతోషంగా ఉందని అన్నారు. అయితే ఈ రూమర్స్ పై త్రివిక్రమ్ మాత్రం స్పందించలేదు. తాజాగా వైరల్ అవుతున్న ఓ ఫొటోతో త్రివిక్రమ్ – విజయ్ భాస్కర్ మధ్య ఎలాంటి గొడవలు లేవని ఆ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టారు.

Also Read : Purushothamudu : రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’ ట్రైలర్ చూశారా..? సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?

విజయ్ భాస్కర్ ప్రస్తుతం ఉషా పరిణయం అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 2న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండగా అందులో హీరోయిన్ సీరత్ కపూర్ నటించింది. తాజాగా సీరత్ కపూర్ ఆ సాంగ్ సెట్స్ నుంచి త్రివిక్రమ్, విజయ్ భాస్కర్ తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. హీరోయిన్ కి అటు ఇటు ఈ గురు శిష్యులు ఇద్దరూ నిల్చొని ఫొటో దిగడంతో ఈ ఫొటో వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by Seerat Kapoor (@iamseeratkapoor)

సీరత్ కపూర్.. త్రివిక్రమ్, విజయ్ భాస్కర్ లతో కలిసి దిగిన ఫొటో షేర్ చేస్తూ.. ఒక రోజు నేను సర్ ప్రైజ్ అయ్యాను. త్రివిక్రమ్ సర్ సెట్స్ కి వచ్చి మానిటర్ లో నా పర్ఫార్మెన్స్ చూసారు. నేను ఆ పాత్రలో మునిగిపోయాను. విజయ్ భాస్కర్ సర్ నన్ను కొత్తగా పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ సినిమా గురించి పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. ఈ ఫొటోతో, ఈ మీటింగ్ తో త్రివిక్రమ్ – విజయ్ భాస్కర్ మధ్య ఎలాంటి విబేధాలు లేవని క్లారిటీ వచ్చేసింది.