Sunil Shetty : ఒకప్పుడు మేము ఎన్నో మంచి సినిమాలు చేశాం.. కానీ ఇప్పుడు.. బాయ్ కాట్ బాలీవుడ్ పై సునీల్ శెట్టి వ్యాఖ్యలు..

ఈ బాయ్ కాట్ వివాదంపై బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి మాట్లాడుతూ.. ''మేము ఒకప్పుడు చాలా మంచి సినిమాలు చేశాం. కానీ ఇప్పుడు................

Sunil Shetty :  వరుస సినిమాలు ఫ్లాప్ అవుతూ బాలీవుడ్ బాధల్లో ఉంటే రోజు రోజుకి బాయ్‌కాట్‌ బాలీవుడ్ వివాదం ముదురుతోంది. బాలీవుడ్ స్టార్స్ ని, బాలీవుడ్ సినిమాలని వరుసపెట్టి బాయ్‌కాట్‌ చేస్తున్నారు ప్రేక్షకులు, నెటిజన్లు. ఇలాంటి సమయంలో సైలెంట్ గా ఉండాల్సింది పోయి అక్కర్లేని కామెంట్స్ చేస్తూ కొంతమంది స్టార్స్ ఈ వివాదంలో తలదూర్చడంతో వాళ్ళని కూడా బాయ్ కాట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఈ బాయ్ కాట్ బాలీవుడ్ వివాదంపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.

Chiranjeevi Sarja : అతను సజీవంగా లేకపోయినా నా గుండెల్లో ఎప్పటికి ఉంటాడు.. హీరో పేరు పచ్చబొట్టు వేయించుకున్న భార్య..

ఈ బాయ్ కాట్ వివాదంపై బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి మాట్లాడుతూ.. ”మేము ఒకప్పుడు చాలా మంచి సినిమాలు చేశాం. కానీ ఇప్పుడు మేం చేస్తున్న కథల పట్ల ప్రజలు సంతోషంగా లేరనుకుంటున్నాను. అందుకే బాలీవుడ్‌ ఇప్పుడు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటుంది. ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రావడం లేదనేది నేను కచ్చితంగా చెప్పలేను. దానికి కారణాలేంటో వేలెత్తి చూపించలేను. ఒకప్పుడు జనాలకి వినోదం అంటే టీవీ, థియేటర్లే. కానీ ఇప్పుడు ఓటీటీ వల్ల ప్రపంచంలోని అన్ని సినిమాలు, మంచి షోలు మన చేతిలో ఉంటున్నాయి. దాని వల్ల కూడా సినిమా పరిశ్రమ దెబ్బ తింటుంది. ఇది దేశ వ్యాప్తంగా జరుగుతుంది” అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు