Chiranjeevi Sarja : అతను సజీవంగా లేకపోయినా నా గుండెల్లో ఎప్పటికి ఉంటాడు.. హీరో పేరు పచ్చబొట్టు వేయించుకున్న భార్య..

 కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జా చాలా యంగ్ ఏజ్ లో రెండేళ్ల క్రితం కరోనా సమయంలో గుండెపోటుతో మరణించాడు. అప్పటికే తన భార్య, నటి మేఘనా రాజ్ ప్రెగ్నెన్సీతో ఉంది. చిరంజీవి మరణం ఆమె తట్టుకోలేకపోయింది. కానీ తనకు పుట్టబోయే బిడ్డ కోసం............

Chiranjeevi Sarja :  కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జా చాలా యంగ్ ఏజ్ లో రెండేళ్ల క్రితం కరోనా సమయంలో గుండెపోటుతో మరణించాడు. అప్పటికే తన భార్య, నటి మేఘనా రాజ్ ప్రెగ్నెన్సీతో ఉంది. చిరంజీవి మరణం ఆమె తట్టుకోలేకపోయింది. కానీ తనకు పుట్టబోయే బిడ్డ కోసం స్ట్రాంగ్ గా బతకాలని అనుకుంది. అతని మరణం తర్వాత ఇటీవలే కోలుకుంటుంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ బయటకి వస్తూ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ట్రై చేస్తుంది.

అయితే కొన్ని రోజుల నుంచి మేఘన రెండో పెళ్లి చేసుకోబోతోంది అని వార్తలు వచ్చాయి. ఈ వార్తలకి గట్టి కౌంటర్ ఇచ్చింది మేఘన. తన చేతిమీద భర్త చిరంజీవి పేరు, కొడుకు రాయన్ పేరు వచ్చేలా చిరు, రాయన్ అని పచ్చబొట్టు వేయించుకుంది. ఈ పచ్చబొట్టుని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది మేఘనా రాజ్. తన చేతి మీద ఉన్న పచ్చబొట్టు ఫోటోలని షేర్ చేసి వీళ్ళు ఎప్పటికి నా వాళ్ళు అని పోస్ట్ చేసింది. దీంతో మేఘన రెండో పెళ్లి చేసుకోదని క్లారిటీ ఇచ్చింది.

JP Nadda To Meet Actor Nithin : నిన్న జూ.ఎన్టీఆర్‌, నేడు నితిన్‌.. తెలుగు హీరోలపై కన్నేసిన బీజేపీ హైకమాండ్.. నడ్డాతో భేటీ కానున్న నితిన్

నటి, చిరంజీవి భార్య మేఘన రాజ్ ఇలా పచ్చబొట్టు ఫోటోలని షేర్ చేయడంతో చిరంజీవి అభిమానులు, నెటిజన్లు ఆమెని పొగిడేస్తున్నారు. భర్త చనిపోయినా అతని జ్ఞాపకాలతో జీవితాంతం బతికేందుకు నిర్ణయం తీసుకున్న మేఘనాని అంతా అభినందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు