Naveen Vijaya Krishna : విజయ్ నిర్మల కోరిన ఏకైక కోరిక.. అందుకే హీరోగా ఎంట్రీ..

విజయ నిర్మల కోరిని ఏకైక కోరిక కావడంతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..?

Vijaya Nirmala wish is to see Naresh son Naveen Vijaya Krishna as hero

Naveen Vijaya Krishna : సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా, దర్శకురాలిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసిన విజయ్ నిర్మల (Vijaya Nirmala) గురించి ప్రత్యేక పరిచయం ఇవ్వనవసరం లేదు. మహిళా దర్శకురాలిగా అత్యధిక సినిమాలు తీసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (Guinness Book) బుక్ లో కూడా స్థానం దక్కించుకున్నారు. ఇక ఆమె వారసులుగా ఇండస్ట్రీకి పరిచయమైన నటులు.. సీనియర్ హీరో నరేష్ (Naresh) మరియు అతడి కుమారుడు ‘నవీన్ విజయ కృష్ణ’. నరేష్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరీర్ లో ఇంకా బిజీగానే ఉన్నారు.

Adipurush : చంద్రయాన్ సక్సెస్‌తో ఆదిపురుష్ పై విమర్శలు.. ఓం రౌత్‌ని ఆడేసుకుంటున్న నెటిజన్లు..

అయితే నరేష్ తనయుడు, విజయ నిర్మల మనవడు నవీన్ మాత్రం హీరోగా రాణించలేకపోయాడు. నవీన్ కి మొదటి నుంచి దర్శకుడు అవ్వాలనే కోరిక ఉండేది. అందుకనే ఎడిటింగ్, యానిమేషన్, ఇతర క్రాఫ్ట్స్ పై పూర్తీ అవగాహన తెచ్చుకొని డైరెక్టర్ గా పరిచయం అవుదాం అనుకున్నాడు. కానీ ఇంతలో నాయనమ్మ విజయ నిర్మల.. నవీన్ ని హీరోగా చూడాలని కోరడంతో నటన వైపు ప్రయాణం మళ్లింది. విజయ నిర్మల తనని కోరిన ఏకైక కొరక కావడంతో నవీన్ కాదనలేక.. ‘ఐనా ఇష్టం నువ్వు’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పూజా హెగ్డే ప్లేస్‌లో ఆ హీరోయిన్ ఫిక్స్.. మొన్నటిదాకా అబ్బాయి ఇప్పుడు బాబాయ్‌ సరసన..

కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్. కానీ ఈ మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత ‘ఊరంతా అనుకుంటున్నారు’ అనే మూవీతో వచ్చినా అది కూడా హిట్ అందించలేకపోయింది. దీంతో యాక్టింగ్ కెరీర్ కి గుడ్ బై చెప్పేశాడు. ఇప్పుడు దర్శకుడిగా ఒక ఫీచర్ షార్ట్ ఫిలింతో ఆడియన్స్ కి పరిచయం అవ్వబోతున్నాడు. సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej), కలర్ స్వాతి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ సత్య (Satya) అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల మూవీలోని సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు