#TwinTowers: నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతలో 10 కీలక అంశాలు

దాదాపు వెయ్యి కోట్ల ఖర్చుతో నిర్మించిన నోయిడాలోని ట్విన్ టవర్స్.. ఆదివారం మధ్యాహ్నం 2:45 నిమిషాలకు 9 సెకన్లలో నేలమట్టమయ్యాయి. మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రారంభమైన డిమోలిష్ ఆపరేషన్.. 30 నిమిషాల్లో పూర్తి చేసుకుంది. సెక్టార్ 93ఏలో ఉన్న ఈ ట్విన్ టవర్స్ కూల్చివేతకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించారు. రెండు భవనాల్లో మొత్తం 7,000 రంధ్రాలు, 20,000 సర్క్యూట్స్ ఏర్పాటు చేశారు

#TwinTowers: దాదాపు వెయ్యి కోట్ల ఖర్చుతో నిర్మించిన నోయిడాలోని ట్విన్ టవర్స్.. ఆదివారం మధ్యాహ్నం 2:45 నిమిషాలకు 9 సెకన్లలో నేలమట్టమయ్యాయి. మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రారంభమైన డిమోలిష్ ఆపరేషన్.. 30 నిమిషాల్లో పూర్తి చేసుకుంది. సెక్టార్ 93ఏలో ఉన్న ఈ ట్విన్ టవర్స్ కూల్చివేతకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించారు. రెండు భవనాల్లో మొత్తం 7,000 రంధ్రాలు, 20,000 సర్క్యూట్స్ ఏర్పాటు చేశారు. ప్రతి అంతస్తులో పేలుడు పదార్థాలను అమర్చి.. వాటర్ ఫాల్ టెక్నిక్ అనే పద్దతిలో భవనాలు నిలువుగా కింద పడేలాగా ప్లాన్ చేసి, పని పూర్తి చేశారు.

అయితే ఈ ట్విన్ టవర్స్ ఎందుకు కూల్చారు.. దీని వెనకున్న కారణాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకు గల ప్రధాణమైన కారణాలేంటో తెలుసుకుందాం.
1. ట్విన్ టవర్స్ కూల్చివేతకు ప్రధాన కారణం నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టడం.
2. నోయిడాలోని సూపర్‭టెక్ ఎమరాల్డ్ కోర్టు అనే హౌసింగ్ సొసైటీ.. తొమ్మిది అంతస్తుల ఎత్తుతో 14 టవర్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. అయితే నిర్మాణదారులు ఈ ప్లాన్ మార్చి 40 అంతస్తులతో రెండు టవర్లు నిర్మించారు.
3. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. టవర్లు నిర్మించిన ప్రాంతాన్ని ఉద్యానవనంగా తీర్చిదిద్దాలి.
4. గృహ సముదాయాలకు 16 మీటర్ల దూరంలో ఇలాంటి టవర్లు నిర్మించాలని నిబంధనలు ఉన్నప్పటికీ కేవలం 9 మీటర్ల దూరంలోనే నిర్మించారు.
5. ఈ కారణాలతో సూపర్‭టెక్ ఎమరాల్డ్ కోర్టు హౌసింగ్ సొసైటీ పోయిన ఆగస్టులోనే అలహాబాద్ హౌకోర్టును ఆశ్రయించింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ కేసుపై తీర్పు రావడానికి ఏడాది సమయం పట్టింది.
6. ఎట్టకేలకు ట్విన్ టవర్స్ నిర్మాణం నిబంధనలకు పూర్తి విరుద్ధంగా జరిగిందని అలహాబాద్ హైకోర్టు అభిప్రాయపడింది.
7. సుప్రీంకోర్టు సైతం అలహాబాద్ హైకోర్టు తీర్పుతో ఏకీభవించింది. నోయిడా అథారిటీస్ నిబంధనలేవీ పాటించలేదని పేర్కొంది.
8. మొత్తానికి ట్విన్ టవర్స్ కూల్చివేయాలని తీర్పు వెలువడింది. అనంతరం.. ఆగస్టు 28 మధ్యాహ్నం 2:45 నిమిషాలకు ట్విన్ టవర్స్ నేలకూలాయి.
9. ట్విన్ కూల్చివేతకు పూర్తి ఖర్చు నిర్మాణం చేపట్టిన కంపెనీయే భరించింది.
10. కూల్చివేత పూర్తిగా నోయిడా అథారిటీ ఆదేశాలనుసారం జరిగింది.

Noida Twin Towers Demolition : కూల్చివేత తర్వాత నోయిడా ట్విన్ టవర్స్ వద్ద దృశ్యాలు

ట్రెండింగ్ వార్తలు