Gautam Adani Group: హిండెన్‌బర్గ్ దెబ్బకు.. గ్రాంట్ థోర్న్‌టన్‌ను నియమించుకున్న అదానీ గ్రూప్

అదానీ గ్రూప్‌లోని కొన్ని కంపెనీల లెక్కలను ఆడిట్ చేసేందుకు స్వతంత్ర అకౌంటింగ్ ఆడిట్‌ సంస్థ గ్రాంట్ థోర్నటన్‌ (Grant Thornton) ను నియమించుకున్నట్లు తెలిసింది. హిండెన్‌బర్గ్ నివేదికలోని ఆరోపణలను తిప్పికొట్టేందుకు, అదానీ గ్రూప్‌ను మళ్లీ గాడిలో పెట్టేందుకు అదానీ గ్రూప్ చేసిన మొదటి ప్రయత్నంగా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

Gautam Adani Group: అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) భారతదేశంకు చెందిన గౌతమ్ అదానీ గ్రూప్‌పై సంచలన నివేదిక ఇచ్చిన విషయం విధితమే. అదానీ గ్రూప్ (Adani Group) భారతీయ చట్టాలను ఉల్లంఘించిందని, తప్పుడు మార్గంలో షేర్ల విలువను పెంచుకునే ప్రయత్నాలు చేసిందని హిండెన్‌బర్గ్ ఆ నివేదికలో ఆరోపించిన విషయం విధితమే. గత నెల 24న హిండెన్‌బర్గ్ తన నివేదికను బహిర్గతం చేయగా.. అప్పటి నుంచి అదానీ గ్రూప్, దాని అనుబంధ సంస్థల షేర్లు భారీగా పతనానికి చేరుకున్నాయి. అప్పటి వరకు ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానం వరకు వచ్చిన అదానీ.. హిండెన్‌బర్గ్ నివేదిక తరువాత టాప్-10 జాబితాలో స్థానం కోల్పోయాడు.

Gautam Adani : అయ్యో అదానీ.. మరింత దిగజారాడు, ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 10 నుంచి ఔట్

హిండెన్‌బర్గ్ నివేదిక తప్పు అని, మా కంపెనీల్లో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని, కావాలనే హిండెన్‌బర్గ్ అసత్య ఆరోపణలు చేస్తుందని అదానీ గ్రూప్ పేర్కొంది. అయినా, అదానీ గ్రూప్, దాని అనుబంధ సంస్థల షేర్లు భారీగా పడిపోయాయి. అదానీ గ్రూప్‌కు చెందిన ఏడు లిస్టెడ్ అనుబంధ సంస్థల షేర్లు గత మూడు వారాల్లో మార్కెట్ విలువలో దాదాపు 120 బిలియన్ డాలర్లు కోల్పోవటం గమనార్హం. హిండెన్‌బర్గ్ నివేదిక ఆధారంగా అదానీ గ్రూప్‌లపై చర్యలు తీసుకోవాలని, విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్‌లో, బయట కేంద్రంపై ఒత్తిడి పెంచాయి.

Hindenburg Report-ADANI Group: అదానీకి ఐదు సవాళ్లు.. అందరి ఆశలు జనవరి 30పైనే..

రోజురోజుకు తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అదానీ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. అదానీ గ్రూప్‌లోని కొన్ని కంపెనీల లెక్కలను ఆడిట్ చేసేందుకు స్వతంత్ర అకౌంటింగ్ ఆడిట్‌ సంస్థ గ్రాంట్ థోర్నటన్‌ (Grant Thornton) ను నియమించుకున్నట్లు తెలిసింది. హిండెన్‌బర్గ్ నివేదికలోని ఆరోపణలను తిప్పికొట్టేందుకు, అదానీ గ్రూప్‌ను మళ్లీ గాడిలో పెట్టేందుకు అదానీ గ్రూప్ చేసిన మొదటి ప్రయత్నంగా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ విషయాన్ని అదానీ గ్రూప్ గోప్యంగా ఉంచింది. అదానీ గ్రూప్‌లో సంబంధిత సంస్థల లావాదేవీలు కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని గ్రాంట్ థోర్న్‌టన్ పరిశీలిస్తుందని సమాచారం. ఈ విషయంపై గ్రాంట్ థోర్న్‌టన్, అదానీ గ్రూప్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు.

ట్రెండింగ్ వార్తలు