Kalki 2898AD : కల్కి రిలీజ్ డేట్ ఫిక్స్..? స్కూల్స్, కాలేజీలు ఓపెన్ అయ్యే టైంకి.. వర్కౌట్ అవుద్దా?

కల్కి 2898AD సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తుంది. అయితే కల్కి సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.

Kalki 2898AD : ప్రభాస్(Prabhas) కల్కి సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీ బ్యానర్ పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో కమల్ హాసన్, రానా, దిశా పటాని, దీపికా పదుకోన్.. లాంటి స్టార్ ఆర్టిస్టులతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజయిన గ్లింప్స్ తో కల్కి 2898AD సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల అమితాబ్ ని అశ్వత్థామగా చూపించి కల్కి సినిమాపై ఒక్కసారిగా హైప్ పెంచారు.

దీంతో కల్కి 2898AD సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తుంది. అయితే కల్కి సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. VFX వర్క్స్ ఇన్నాళ్లు అవ్వకపోవడంతో వాయిదా పడిన కల్కి ఇప్పుడు ఎన్నికల వల్ల వాయిదా పడింది. దీంతో కల్కి రిలీజ్ ప్రశ్నార్థకంగా మిగిలింది. సమ్మర్ లో వచ్చి పెద్ద హిట్ కొట్టి భారీ కలెక్షన్స్ సాధించాలి అనుకున్నారు కల్కి టీం. కానీ ఎన్నికలు కల్కి టీంని దెబ్బ తీశాయి.

Also Read : Sukumar : వాళ్ళిద్దరి వల్లే అన్ని సినిమాలు రాశాను.. స్టేజిపై ఎమోషనల్ అయిన సుకుమార్..

అయితే ఎన్నికలు అయి, రిజల్ట్స్ వచ్చాకే సినిమా రిలీజ్ చేయాలి. టికెట్ రేట్లు పెంచాలన్న ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకే. దీంతో ఎన్నికల రిజల్ట్స్ వచ్చాకే కల్కి రిలీజ్ అవుతుంది. కానీ ఎప్పుడు అనేది ఇన్నాళ్లు క్లారిటీ రాలేదు. తాజాగా జూన్ 27న కల్కి సినిమా రిలీజ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాంటి పండగలు లేని టైం, సెలవులు అయిపోయి పిల్లలు స్కూల్స్, కాలేజీకి వెళ్లే టైం, కేవలం వీకెండ్ తప్ప ఇంకెలాంటి స్పెషల్ లేని సమయంలో అంత భారీ బడ్జెట్ కల్కి రిలీజయి సక్సెస్ అవుతుందా? సినిమా హిట్ టాక్ వచ్చినా కలెక్షన్స్ భారీగా వస్తాయా అని చర్చిస్తున్నారు. మరి అదే డేట్ కి రిలీజ్ చేస్తారా లేదా మళ్ళీ వాయిదా పడుతుందా చూడాలి.

ట్రెండింగ్ వార్తలు