Sukumar : వాళ్ళిద్దరి వల్లే అన్ని సినిమాలు రాశాను.. స్టేజిపై ఎమోషనల్ అయిన సుకుమార్..

ప్రసన్న వదనం డైరెక్టర్ అర్జున్ తనకి ప్రియ శిష్యుడు అని చెప్పుకొచ్చారు సుకుమార్.

Sukumar : వాళ్ళిద్దరి వల్లే అన్ని సినిమాలు రాశాను.. స్టేజిపై ఎమోషనల్ అయిన సుకుమార్..

Sukumar Got Emotional while Speaking about his Direction Department

Sukumar : ‘ఆర్య’తో పరిచయమైన సుకుమార్ ఇప్పుడు ‘పుష్ప'(Pushpa) సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగాడు. త్వరలో సుకుమార్ దగ్గర్నుంచి రాబోయే పుష్ప 2 సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తుంది. తాజాగా సుహాస్ నటించిన ప్రసన్న వదనం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి సుకుమార్ గెస్ట్ గా వచ్చారు. ఈ సినిమా దర్శకుడు అర్జున్ సుకుమార్ దగ్గర దాదాపు 15 ఏళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు. ఈవెంట్లో ప్రసన్న వదనం డైరెక్టర్ అర్జున్ తనకి ప్రియ శిష్యుడు అని చెప్పుకొచ్చారు సుకుమార్.

సుకుమార్ మాట్లాడుతూ.. జగడం సినిమా తీస్తున్న సమయంలో అర్జున్ నా దగ్గరికి వచ్చి మీ ఆర్య నాకు బాగా నచ్చింది. మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు చాలా బక్కగా, చిన్నపిల్లాడిలా ఉండేవాడు. జగడం సినిమా దగ్గర్నుంచి అర్జున్ నా దగ్గర పనిచేస్తున్నాడు. జగడం తర్వాత నా దగ్గర ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా వెళ్లిపోయారు అర్జున్, తోటశ్రీను తప్ప. వాళ్ళిద్దరితో నేను కూర్చొని కేవలం 23 రోజుల్లో 100% లవ్ సినిమా రాశాను. అప్పట్నుంచి ప్రతి సినిమా వాళ్ళతోనే కూర్చొని రాస్తున్నాను. వాళ్లే నాకు బలం. నా అన్ని సినిమాలకు పనిచేశారు. ఆ తర్వాత వేరేవాళ్లు వచ్చి జాయిన్ అయి వెళ్తుండేవాళ్లు. కానీ అర్జున్, తోటశ్రీను మాత్రం నా దగ్గరే ఉన్నారు. అర్జున్ చాలా నిజాయితిగా ఉంటాడు, అమాయకుడు. నా అర్జున్ ఇప్పుడు డైరెక్టర్ గా రాబోతున్నాడు. నా వల్ల వాడికి ఎంత మంచి జరిగిందో తెలీదు కానీ వాడి వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. లవ్ యు అర్జున్. నా అర్జున్ కి సపోర్ట్ చేయండి. థియేటర్ కి వచ్చి ప్రసన్నవదనం సినిమా చూడండి అంటూ ఎమోషనల్ అయ్యారు సుకుమార్.

Also Read : Sukumar : పుష్ప ‘కేశవ’ పాత్రకు నేను, బన్నీ సుహాస్‌నే అనుకున్నాం.. కానీ..

సుకుమార్ తన డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి చెప్తూ, దర్శకుడు అర్జున్ గురించి చెప్తూ ఎమోషనల్ అవ్వడంతో సుకుమార్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దాదాపు 15 ఏళ్ళు పైగా సుకుమార్ కి అర్జున్ అండగా నిలబడ్డాడు. అందుకే సుక్కు అంత ఎమోషనల్ అయ్యారని భావిస్తున్నారు.