Sukumar : పుష్ప ‘కేశవ’ పాత్రకు నేను, బన్నీ సుహాస్‌నే అనుకున్నాం.. కానీ..
సుహాస్ నటించిన ప్రసన్న వదనం సినిమా మే 3న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కావడంతో ఈవెంట్ కి డైరెక్టర్ సుకుమార్ గెస్ట్ గా వచ్చాడు.

Sukumar and Allu Arjun wants to do Pushpa Keshava Character by Suhas
Sukumar : పుష్ప(Pushpa) సినిమాలో అల్లు అర్జున్(Allu Arjun) క్యారెక్టర్ ఎంత వైరల్ అయిందో పుష్ప పక్కనే ఉండే కేశవ పాత్ర కూడా అంతే బాగా వైరల్ అయింది. చిత్తూరు యాసలో మాట్లాడుతూ ఆ పాత్రలో నటించి నవ్వించి జగదీశ్ ప్రేక్షకులని మెప్పించాడు. అయితే ఆ పాత్రకు ముందుగా సుహాస్(Suhas) ని అనుకున్నట్టు సుకుమార్ తాజాగా తెలిపాడు.
సుహాస్ నటించిన ప్రసన్న వదనం సినిమా మే 3న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కావడంతో ఈవెంట్ కి డైరెక్టర్ సుకుమార్ గెస్ట్ గా వచ్చాడు. ఈ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడుతూ.. సుహాస్ నువ్వంటే నాకు, అల్లు అర్జున్ కి చాలా ఇష్టం. అల్లు అర్జున్ నీ గురించి చాలా సార్లు మాట్లాడాడు. ఫస్ట్ పుష్పలో జగదీశ్ చేసిన కేశవ క్యారెక్టర్ కి నేను, బన్నీ నిన్నే అనుకున్నాం. కానీ నువ్వు అప్పటికే హీరోగా చేస్తుండటంతో నిన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడగడం బాగోదు అని ఆగిపోయాము అని తెలిపారు.
అలాగే వరుసగా కొత్త కొత్త కథలు, పాత్రలతో వస్తున్న సుహాస్ ని అభినందించారు. నానితో పోలుస్తూ సుహాస్ కూడా ఫ్యూచర్ లా పెద్ద స్టార్ అవుతాడు అని అన్నారు. అన్ని పాత్రల్లోనూ సుహాస్ ఇమిడిపోతాడు అంటూ ప్రశంసించారు.
Also Read : Raashii Khanna : రాశీఖన్నాపై సంచలన వ్యాఖ్యలు చేసిన అవసరాల శ్రీనివాస్.. స్టంట్ మాస్టర్ కన్నా దారుణంగా..
ప్రసన్న వదనం డైరెక్టర్ అర్జున్ సుకుమార్ కి ప్రియ శిష్యుడు కావడంతో ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు. అర్జున్ గురించి కూడా గొప్పగా చెప్పారు.