Raashii Khanna : రాశీఖన్నాపై సంచలన వ్యాఖ్యలు చేసిన అవసరాల శ్రీనివాస్.. స్టంట్ మాస్టర్ కన్నా దారుణంగా..
రాశీఖన్నా, అవసరాల శ్రీనివాస్ మధ్య మంచి స్నేహం ఉంది. ఊహలు గుసగుసలాడే తర్వాత పలు సినిమాల్లో కూడా కలిసి నటించారు.

Avasarala Srinivas Interesting Comments on Raashii Khanna goes Viral
Raashii Khanna : రాశీఖన్నా తెలుగు, తమిళ్ లో సినిమాలు చేసి అనంతరం బాలీవుడ్ కి చెక్కేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. అప్పుడప్పుడు తెలుగు, తమిళ్ లోనూ కనిపిస్తుంది. తెలుగులో రాశీఖన్నా మనం సినిమాలో ఓ గెస్ట్ పాత్రతో కనిపించినా హీరోయిన్ గా పరిచయం అయింది మాత్రం ఊహలు గుసగుసలాడే సినిమాతోనే. అవసరాల శ్రీనివాస్(Avasarala Srinivas) డైరెక్టర్ గా మొదటి సినిమా ఇదే. ఈ సినిమాతోనే రాశీఖన్నాని హీరోయిన్ గా తెలుగు పరిశ్రమకి పరిచయం చేసాడు.
రాశీఖన్నా, అవసరాల శ్రీనివాస్ మధ్య మంచి స్నేహం ఉంది. ఊహలు గుసగుసలాడే తర్వాత పలు సినిమాల్లో కూడా కలిసి నటించారు. తాజాగా అవసరాల శ్రీనివాస్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాశీఖన్నా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాశీఖన్నా కార్ డ్రైవ్ చేస్తే నేను కూర్చొను. స్టంట్ మాస్టర్ కన్నా దారుణంగా డ్రైవ్ చేస్తుంది. ఒక్కసారి ఎక్కాను, మళ్ళీ నా వల్ల కాదు. ఇంకెప్పుడు రాశీఖన్నా కార్ డ్రైవ్ చేస్తే ఎక్కకూడదు అని డిసైడ్ అయ్యాను అని అన్నారు.
Also Read : Avasarala Srinivas : అవసరాల శ్రీనివాస్ అమెరికాలో స్టేట్ లెవల్ ప్లేయర్.. ఏ గేమ్ లోనో తెలుసా?
దీంతో రాశీఖన్నా కార్ డ్రైవింగ్ అనుభవం అవసరాల శ్రీనివాస్ కి బాగా గుర్తుండిపోయేలా చేసింది పాపం, అసలు ఎప్పటికి రాశీఖన్నా డ్రైవ్ చేస్తే కార్ ఎక్కను అనేంతలా ఫిక్స్ అయ్యారంటే ఆమె ఎంతలా భయపెట్టిందో అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.