Avasarala Srinivas : అవసరాల శ్రీనివాస్ అమెరికాలో స్టేట్ లెవల్ ప్లేయర్.. ఏ గేమ్ లోనో తెలుసా?

అవసరాల శ్రీనివాస్ ఇక్కడ ఇంజనీరింగ్ చదివాక MS చదవడానికి అమెరికా వెళ్లారు

Avasarala Srinivas : అవసరాల శ్రీనివాస్ అమెరికాలో స్టేట్ లెవల్ ప్లేయర్.. ఏ గేమ్ లోనో తెలుసా?

Avasarala Srinivas is a State Level Player in Racquetball game at America

Avasarala Srinivas : అష్టాచమ్మాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అవసరాల శ్రీనివాస్ ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తున్నాడు. అంతేకాకుండా దర్శకుడిగా కూడా పలు సినిమాలు తీసి మెప్పించాడు. ప్రస్తుతం సినిమాలతో బిజీగానే ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్తూ అమెరికాలో ఓ గేమ్ లో స్టేట్ లెవల్ ప్లేయర్ అని తెలిపాడు.

అవసరాల శ్రీనివాస్ ఇక్కడ ఇంజనీరింగ్ చదివాక MS చదవడానికి అమెరికా వెళ్లారు. అమెరికాలో చదివేటప్పుడు అక్కడ రాకెట్ బాల్ గేమ్ నేర్చుకొని రోజూ దాదాపు అయిదు గంటలు ఆడేవారట. తాజాగా ఇంటర్వ్యూలో అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. డైలీ కాలేజీ అయ్యాక సాయంత్రం 5 గంటలకు మొదలుపెడితే రాత్రి 10 గంటల వరకు ఆడేవాన్ని రాకెట్ బాల్ గేమ్. అక్కడ కాలేజీలో, క్లబ్స్ తరపున, ఆ తర్వాత అక్కడే స్టేట్ లెవెల్ లో కూడా రాకెట్ బాల్ ఆడాను అని తెలిపాడు. అక్కడ రాకెట్ బాల్ గేమ్ లో ఎన్నో మెడల్స్ కూడా గెలుచుకున్నాడట. దీంతో నటుడు, రచయిత, దర్శకుడు కాకుండా అవసరాల శ్రీనివాస్ లో రాకెట్ బాల్ గేమ్ ప్లేయర్ కూడా ఉన్నాడని తెలిసింది.

Also Read : Prasanna Vadanam : సుహాస్ ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ రిలీజ్.. బాబోయ్ సస్పెన్స్ థ్రిల్లర్ మాములుగా లేదుగా..

అలాగే అవసరాల శ్రీనివాస్ అమెరికాలో కొన్ని నెలలు హార్డ్ వేర్ జాబ్ కూడా చేసాడట. అష్టాచమ్మా సినిమాలో అవకాశం రావడంతో అక్కడ జాబ్ మానేసి వచ్చారు. ఇక అక్కడనుంచి వెనక్కి తిరగకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులని మెప్పిస్తున్నారు.

Avasarala Srinivas is a State Level Player in Racquetball game at America