Sam Curran : టీ20ల్లో రికార్డు ఛేద‌న‌.. పంజాబ్ కెప్టెన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ ప‌రుగుల వ‌ర్షంతో త‌డిసి ముద్దైంది.

PBKS Captain Sam Curran : కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ ప‌రుగుల వ‌ర్షంతో త‌డిసి ముద్దైంది. శుక్ర‌వారం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టీ20ల్లో భారీ ల‌క్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో కోల్‌క‌తా మొద‌ట బ్యాటింగ్ చేసింది. ఫిల్ సాల్ట్ (75; 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స‌ర్లు), సునీల్ న‌రైన్ (71; 32 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కాలు బాద‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 261 ప‌రుగులు చేసింది.

అనంత‌రం జానీ బెయిర్ స్టో (108; 48 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్స‌ర్లు) విధ్వంస‌కర శ‌త‌కానికి తోడు ప్రభసిమ్రాన్ సింగ్ (54; 20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్) మెరుపు అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించ‌డంతో ల‌క్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 18.4 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

IPL 2024 : టీ20 చరిత్రలోనే తొలిసారి..! పంజాబ్ వర్సెస్ కోల్‌కతా మ్యాచ్‌లో సిక్సర్ల రికార్డు బద్దలు

ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన త‌రువాత పంజాబ్ కెప్టెన్ సామ్ కర్రాన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం వ‌ల్ల ఎంతో ఆనందంగా ఉంద‌ని చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్‌లో ప‌రుగుల వ‌ర‌ద పార‌డం పై స్పందిస్తూ.. క్రికెట్ బేస్ బాల్‌గా మారుతోంది అని చ‌మ‌త్క‌రించాడు. మైదానాలు చిన్న‌గా ఉండ‌డం, తేమ ప్ర‌భావం కార‌ణంగా బ్యాట‌ర్లు చెల‌రేగుతున్నార‌న్నాడు. రివ్యూల‌తో కూడా ఎక్స్‌ట్రా బంతుల‌ను వేయాల్సి వ‌స్తుంద‌న్నాడు.

ఇక త‌మ జ‌ట్టు పుంజుకోవ‌డంలో కోచ్‌లు కీల‌క పాత్ర పోషించార‌ని చెప్పుకొచ్చాడు. గ‌త కొన్ని వారాలు త‌మ జ‌ట్టుకు క‌ఠినంగా గ‌డిచింది. ఈ గెలుపు చాలా కీల‌క‌మ‌న్నాడు. ఇక జానీ బెయిర్ స్టో అసాధార‌ణ ఇన్నింగ్స్ ఆడాడ‌ని మెచ్చుకున్నాడు. ఈ సీజ‌న్‌లో శ‌శాంక్ సింగ్‌, అఘుతోష్ వంటి ప్ర‌తిభావంతులైన క్రీడాకారులని, ప్ర‌తి ఒక్క ప్లేయ‌ర్ కూడా మంచి ప్ర‌ద‌ర్శ‌న‌నే ఇస్తున్న‌ట్లు సామ్ క‌ర‌న్ చెప్పుకొచ్చాడు.

Jasprit Bumrah : ముంబై ఓపెన‌ర్‌గా జ‌స్‌ప్రీత్ బుమ్రా..?

ట్రెండింగ్ వార్తలు