IPL 2024 : టీ20 చరిత్రలోనే తొలిసారి..! పంజాబ్ వర్సెస్ కోల్‌కతా మ్యాచ్‌లో సిక్సర్ల రికార్డు బద్దలు
పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లో సిక్సర్ల వరద పారింది. ఐపీఎల్, టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు నమోదు కావటం ఇదే తొలిసారి.

KKR vs PBKS match
KKR vs PBKS : ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు అదరగొట్టింది. కోల్‌కతా నిర్దేశించిన 262 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ జట్టు ఛేదించింది. ఫలితంగా కోల్‌కతాపై ఎనిమిది వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో సిక్సర్ల మోత మోగింది. ఇరు జట్ల ఆటగాళ్లు బౌల్ ను బౌండరీలైన్ బయటకు కొట్టడంలో పోటీపడ్డారు. దీంతో సిక్సర్లలో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది.
Also Read : IPL 2024 : సెంచరీతో బెయిర్‌స్టో విజృంభణ.. పంజాబ్ దెబ్బకు కోల్‌కతా ఖేల్ ఖతం.. ఉఫ్ అని ఊదేసింది..!
పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లో సిక్సర్ల వరద పారింది. ఐపీఎల్, టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు నమోదు కావటం ఇదే తొలిసారి. ఇరు జట్ల బ్యాటర్లు మొత్తం 42 సిక్సులు కొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు బ్యాటర్లు 18 సిక్సులు కొట్టగా.. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు 24 సిక్సర్లు కొట్టారు. గతంలో ఇదే 2024 ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ వర్సెస్ ముంబై జట్టు మధ్య జరిగిన మ్యాచ్ లో మొత్తం 38 సిక్సులు నమోదయ్యాయి. ఆ రికార్డును పంజాబ్ వర్సెస్ కోల్ కతా జట్ల మధ్య శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ బద్దలు కొట్టేసింది.
Also Read : IPL 2024 : పంజాబ్ జట్టు గెలుపు సంబరాలు చూశారా.. వీడియో వైరల్
పురుషుల టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు..
ఐపీఎల్ 2024 : 42 సిక్సర్లు (కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్)
ఐపీఎల్ 2024 : 38 సిక్సర్లు (సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్)
ఐపీఎల్ 2024 : 38 సిక్సర్లు (బెంగళూరు వర్సెస్ హైదరాబాద్)
షార్జా 20 : 37 సిక్సులు (బాల్ఖ్ లెజెండ్స్ వర్సెస్ కాబుల్ జ్వానన్)
సీపీఎల్ 2019 : 31 సిక్సులు (SKNP vs JT)
SHASHANK SINGH HAVE IMPRESSED EVERYONE IN IPL 2024. ?❤️pic.twitter.com/2LX6DS6Jjn
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 26, 2024