Vande Bharat Express: మళ్లీ ఆగిపోయిన ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ రైలు.. ఈ సారి ఎందుకో తెలుసా

ఇటీవలే ఘనంగా ప్రారంభమైన ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ రైలు మరోసారి నిలిచిపోయింది. ఇటీవలే గేదె ఢీకొనడం వల్ల ఆగిపోయిన ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ రైలు ఈ సారి సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయింది.

Vande Bharat Express: ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ రైలు వరుసగా వైఫల్యాలకు గురవుతోంది. రెండు రోజుల క్రితమే గేదె ఢీకొనడంతో ప్రమాదానికి గురై, వందేభారత్ రైలు ముందుభాగం డ్యామేజ్ అయి, ఆగిపోయిన సంగతి తెలిసిందే.

Type-C Cable: చార్జింగ్ కేబుల్ కష్టాలకు చెల్లు.. ఇకపై అన్ని గాడ్జెట్లకు ఒకటే కేబుల్.. చట్టం చేసిన యురోపియన్ యూనియన్

ఈ ఘటన మరువక ముందే మరోసారి రైలు ఆగిపోయింది. ఈ సారి రైలు చక్రం ఆగిపోయిన కారణంగా రైలు నిలిచిపోయింది. శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ రైలు డంకౌర్-వయా స్టేషన్ల మధ్య ప్రయాణిస్తుండగా, సీ8 కోచ్‌కు సంబంధించిన చక్రం సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. చక్రం మోటార్ లోపం కారణంగా రైలు ఆగిపోయింది. దీంతో అధికారులు రైలును నిలిపివేశారు. నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సమస్యను గుర్తించారు.

Bandi sanjay slams kcr: నల్లపిల్లితో కేసీఆర్ తాంత్రిక పూజలు.. ఓ స్వామీజీ చెప్పారు: బండి సంజయ్

రైలును మరో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుర్జా రైల్వే స్టషన్‌కు తీసుకెళ్లారు. సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు మరికొంత సమయం పడుతుంది. దీంతో ప్రయాణికులను అక్కడి రైల్వే స్టేషన్లో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లోకి తరలించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని అధికారులు తెలిపారు.

 

 

ట్రెండింగ్ వార్తలు