Best Drinks : శరీరంలో కొవ్వును తగ్గించే పది పానీయాలు..

శరీరంలో కొవ్వు పేరుకుపోతే బరువు పెరిగిపోతాం.కానీ శరీరంలో కొలెస్ట్రాల్ ని నియంత్రించే చక్కటి పానీయాల గురించి మీకు తెలుసా.శక్తితో పాటు .అవసరమైన పోషకాలనిచ్చే చక్కటి పానీయాలు ఇవే..

Weight Loss Drinks : శరీరంలో కొవ్వు పేరుకుపోతే బరువు పెరిగిపోతాం. తద్వారా ఎన్నో అనారోగ్యం సమస్యలు వచ్చేస్తాయి. మన శరీరానికి ఉపయోగపడే కొవ్వు (కొలెస్ట్రాల్). హాని చేసే కొవ్వు ఉంటుంది. కానీ చెడు కొలెస్ట్రాల్ వల్ల ఎన్నో సమస్యలొస్తాయి. HDL అనే మంచి కొలెస్ట్రాల్‌లు మరియు LDL అనే చెడు కొలెస్ట్రాల్ మరియు గ్లిసరైడ్స్ ఉన్నాయి. పెరిగిన LDL స్థాయిలు గుండెకు రక్త ప్రవాహాన్ని నిరోధించే ధమనులలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయి. ఇది చాలా ప్రమాదం. ఫైబర్ ఉండే ఆహారం తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ను ఆరోగ్యకరమైన స్థాయిలో ఉండేలా చూసుకుంటే.. సుదీర్ఘమైన..ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు.ఇలా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించటానికి ఎటువంటి పానీయాలు అవసరం ఈరోజు తెలుసుకుందాం..

గ్రీన్ టీ..
గ్రీన్ టీ తాగితే శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.గ్రీన్ టీలో ఎన్నో వ్యాధులతో పోరాడే ఎపిగాల్లోకెటచిన్-3 గల్లేట్ (EGCG), అనే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. గ్రీన్ టీ రుచికి చేదుగా ఉంటుంది. కానీ తాగితే మాత్రం ఉత్తేజపరుస్తుంది. మనకు ఉత్తేజాలనిచ్చే గుణాలు గ్రీన్ లో ఉన్నాయి. గ్రీన్ టీలో కేటచిన్, ఎపికేటచిన్, ఎపికేటచిన్ గాలెట్,ఎపిగాల్లో కెటచిన్-3 గల్లేట్ అనే కేటచిన్ పోలిఫెనోల్స్ యొక్క రసాయనాలతో పాటు ఇతర ప్రోఏంథోసయినడిన్స్ ఉంటాయి. గ్రీన్ టీ తాగడం వలన LDL, మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ టీలో గ్రీన్ వేరియంట్ కంటే తక్కువ క్యాటెచిన్స్ ఉంటాయి.

 

టమాటో రసం..
టమోటాలో లైకోపీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది హానికర ఆక్సిజెన్ రాడికల్స్ ని తొలగించేందుకు తోడ్పడుతుంది. దీంట్లో నియాసిన్, కొలెస్ట్రాల్ తగ్గించే ఫైబర్స్ కూడా ఉన్నాయి. 2 నెలలు రోజుకు 280ml కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా మెరుగుపరుస్తుందని ఒక అధ్యయనం వెల్లడించింది. టమాటోస్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఒక చిన్న టమాటోలో 16 కేలరీలు లభిస్తాయి. రెండు టమాటోస్ ను తీసుకున్నా కూడా మీరు తీసుకునే కేలరీల సంఖ్య 50 కంటే తక్కవే. కేలరీ ఇంటేక్ అనేది తక్కువగా ఉంటే కేలరీలను ఎక్కువగా బర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కేలరీలు ఫ్యాట్ రూపంలో నిల్వ ఉండవు.

టొమాటోస్ లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తుంది. ఇది హానికర ఆక్సిజెన్ రాడికల్స్ ని తొలగించేందుకు తోడ్పడుతుంది. ఆక్సిజెన్ రాడికల్స్ అనేవి DNA స్ట్రక్చర్ ని ఆల్టర్ చేసి తద్వారా శరీరంలోని ఒక స్ట్రెస్ స్టేట్ ను క్రియేట్ చేస్తాయి. శరీరంలోని ఈ స్ట్రెస్ రెస్పాన్స్ వలన ఫ్యాట్ అక్యుములేషన్ మరియు వెయిట్ గెయిన్ కి దారితీస్తుంది. కాబట్టి, శరీరంలోని టమాటోలు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించి వెయిట్ లాస్ కి తోడ్పడతాయి. 2 నెలల పాటు రోజుకు 280ఎంఎల్ టమాటారసం తాగితే కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా మెరుగుపరుస్తుందని ఒక అధ్యయనం తెలిపింది.

సోయా పాలు
సోయా పాలలో కొవ్వు స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. రెగ్యులర్ క్రీమర్లు,అధిక కొవ్వు ఉన్న పాల కంటే..సోయా పాలు కొలెస్ట్రాల్ తగ్గటానికి ఉపయోగపడతాయి. సోయా పాలలో విటమిన్ బి 12 మరియు రిబోఫ్లేవిన్ ఉంటాయి. తగినంత విటమిన్ బి 12 పొందడం వల్ల కణాలు శక్తిని పొందగలుగాయి.రోజుకు ఒక కప్పు సోయా పాలు తాగితే శరీరానికి మంచి పోషకాలు అందుతాయి.సోయా పాలల్లో కాల్షియం,ఐరన్,ఫైబర్ ఎక్కువ శాతం ఉంటాయి. ఒక కప్పు తియ్యని సోయా పాలలో 300 మి.గ్రా కాల్షియం ఉంటుంది. సోయా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. సాధారణ పాలు కంటే సోయా పాలలో తక్కువ చక్కెర ఉంటుంది. సోయా పాలను క్రమం తప్పకుండా తీసుకోవడం బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది.

వోట్ డ్రింక్స్..
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో వోట్ పానీయాలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇది బీటా-గ్లూకాన్స్ అనే పదార్థాన్ని కలిగి ఉంటుంది. పిత్త లవణాలతో సంకర్షణ చెందుతుంది. ప్రేగులలో జెల్ లాంటి పొరను సృష్టిస్తుంది. కొలెస్ట్రాల్ శోషణను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఒక కప్పు వోట్ పాలు 1.3 గ్రాముల బీటా గ్లూకాన్‌ను అందిస్తుంది. వోట్ డ్రింక్స్ ను కొంటున్నప్పుడు తప్పనిసరిగా వాటి డబ్బాలమీద బీటా-గ్లూకాన్‌లు ఉన్నాయా? లేదా? చెక్ చేసు కొనుక్కోండి.

బెర్రీ స్మూతీస్..
బెర్రీలు యాంటీ ఆక్సిడెంట్ల మయంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో ఎంతగానో సహాయపడతాయి. స్ట్రాబెర్రీలు, రాస్ బెర్రీలు, బ్లూబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్ వంటి అనేక బెర్రీలు యాంటీఆక్సిడెంట్‌లు, ఫైబర్‌లతో నిండి ఉంటాయి. లో ఫ్యాట్ పాలతో, బెర్రీలు కలిపి మిల్క్ షేక్ చేసి తాగితే.. కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా తగ్గుతాయి. కాబట్టి బెర్రీ స్మీతీస్ బరువు తగ్గటానికి చక్కటి పానీయం అని చెప్పటంలో ఎటువంటి సందేహంలేదు.

కోకో పానీయాలు..
కోకోలో ఫ్లేవనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడే అధిక స్థాయి మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలను కలిగి ఉన్న డార్క్ చాక్లెట్‌లో కనిపించే ప్రధాన పదార్ధం కోకో. ఇందులో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరిచే ఫ్లేవనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. రోజుకు రెండుసార్లు 450ఎంజీ కోకో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. పైగా కోకో తీసుకుంటే చక్కటి ఉత్సాహంగా ఉంటుంది. కాకపోతే కోకో ఉపయోగించి చేసే చాక్లెట్లు తినటం మంచిదేకాదు అధికంగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు.వాటిని నివారిస్తే మేలు అని చెబుతున్నారు.

ఆల్కహాల్..
మద్యం మంచిది కాదు. కానీ నియంత్రణలో దాన్ని మెడిసిన్ గా తీసుకుంటే మంచిదే. అధికంగా తీసుకుంటే ఔషధం కూడా విషయం అవుతుందని పెద్దలు ఊరికే చెప్పలేదు.ఇదికూడా అటువంటిదే. మితమైన మద్యపానం రక్తంలో మంచి కొవ్వుల స్థాయిలను పెంచుతుంది. రెడ్ వైన్ యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్నందున ఆల్కహాల్ తీసుకోవచ్చు.రెడ్ వైన్‌ తక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమే కాకుండా కొన్ని గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఎక్కువగా తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందని గుర్తుంచుకోవాలి. అందుకే మహిళలు రోజుకు ఒక గ్లాస్, మగవారికి రోజుకు రెండు గ్లాసులు మోతాదు తాగితే మంచిదని చెబుతున్నారు నిపుణులు.

ప్లాంట్ బేస్డ్ స్మూతీలు (మొక్క ఆధారిత స్మూతీలు)
కాలే, గుమ్మడి, పుచ్చకాయలు, అరటి పండ్లతో తయారు చేసిన పానీయాలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. స్మూతీస్ చేయడానికి ఓట్ మిల్క్‌లో ఈ పదార్థాలను కలపడం వల్ల క్రమరహిత కొలెస్ట్రాల్ స్థాయిలకు కారణమయ్యే తక్కువ సంతృప్త కొవ్వులు ఉండేలా చేస్తుంది.

స్టానాల్స్ అండ్ స్టెరాల్స్ కలిగిన డ్రింక్స్..
స్టెరాల్స్ అండ్ స్టానాల్‌లు కొలెస్ట్రాల్ శోషణను నిరోధించే కొలెస్ట్రాల్ ఆకారం. పరిమాణంలో ఉండే మొక్కల రసాయనాలు. ఆహార కంపెనీలు ఈ రసాయనాలను అనేక ఆహారాలు, పానీయాలకు ఉపయోగపడతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి రోజుకు 1.3 గ్రాముల స్టెరాల్, 3.4 గ్రాముల స్టానాల్ సహాయపడుతుందని FDA పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు