China India border Issue: సరిహద్దు వెంట సాయుధ రోబోలను మోహరించిన చైనా

భారత సైనికులను ఎదుర్కొనేందుకు మానవరహిత సాయుధ రోబోలను (Armed Robots) భారత సరిహద్దు వద్ద మోహరింప చేసేందుకు సిద్ధమైంది చైనా

China India border Issue: భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదం తీవ్రతరం అవుతుందా?. అవుననే అంటున్నాయి అంతర్జాతీయ పరిశీలకుల నివేదికలు. సెప్టెంబర్ 2020లో పాంగోంగ్ లేక్ వద్ద ఇరు దేశాల సైనికులు మధ్య ఘర్షణల అనంతరం చైనా మరింత దూకుడు పెంచింది. ఎలాగైనా భారత్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆనాటి నుంచి వ్యూహరచనలు చేసింది. చైనా సైన్యంలో అత్యంత సుశిక్షితులైన సైనికులను సైతం భారత్ సరిహద్దు “చుసుల్” వద్దకు పంపింది. అయితే అక్కడ మంచుతో కూడిన ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక చైనా సైనికులు వెనక్కు తగ్గారు. దీంతో చైనా మరో పన్నాగం పన్నింది. భారత సైనికులను ఎదుర్కొనేందుకు మానవరహిత సాయుధ రోబోలను (Armed Robots) భారత సరిహద్దు వద్ద మోహరింప చేసేందుకు సిద్ధమైంది. ఈమేరకు ఇప్పటికే పలురకాల సాయుధ రోబోలను టిబెట్ వరకు పంపినట్లు సమాచారం.

Also Read: Potatoes in Flights: 3 విమానాల్లో అమెరికా నుంచి జపాన్‌ కు బంగాళాదుంపల లోడు

సాయుధ రోబోలను యుద్ధరంగంలో వినియోగించరాదంటూ అంతర్జాతీయ మానవ హక్కుల వేదిక గతంలో ప్రపంచ దేశాలను కోరింది, ఇంకా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో చైనా ఇలా సాయుధ రోబోలను మోహరింపజేయడం కొంత ఆందోళనకరంగా మారింది. Sharp Claw, Mule-200 అని పిలువబడే రెండు రకాల సాయుధ రోబో దళాలను చైనా, భారత్ సరిహద్దు వద్ద మోహరింపజేసినట్లు తెలిసింది. దాదాపు 120 నుంచి 250 Mule-200 వాహనాలు టిబెట్ వద్ద సిద్ధంగా ఉన్నాయి. 50 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాలను ఛేదించగల సామర్ధ్యం ఈ Mule-200 రోబోలకు ఉంది. రిమోట్ కంట్రోల్ ఆధారంగా సుదూర ప్రాంతాల్లో ఉంటూ వీటిని నియంత్రించవచ్చు. 80 నుంచి 100 Sharp Claw సాయుధ రోబోలు.. టిబెట్ కు పశ్చిమంగా భారత సరిహద్దు వద్దకు చేరుకున్నట్టు భారత జాతీయ మీడియా పేర్కొంది. మనుషులు చేరుకోలేని, అతి తీవ్ర వాతావరణం కలిగిన ప్రదేశాల్లో ఈ యుద్ధ వాహనాలను చైనా మోహరింపజేసినట్లు సమాచారం.

Also Read: New Florona Variant ఇజ్రాయెల్ లో బయటపడ్డ మరో కొత్తరకం కరోనా వేరియంట్ “ఫ్లోరోనా”

ట్రెండింగ్ వార్తలు