Cow As National Animal?: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ పిటిషన్.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం కోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించబోమని కోర్టు తెలిపింది.

Cow As National Animal?: భారత జాతీయ జంతువుగా ఆవును ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషిన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ ‘గోవాన్ష్ సేవా సదన్’ అనే స్వచ్ఛంద సంస్థ ఒక ప్రజా ప్రయోజన వ్యాఖ్యాన్ని దాఖలు చేసింది.

Apple Watch: యాపిల్ వాచ్ మరో ఘనత… క్లినికల్ టెస్టుకు ముందే వెల్లడించిన ప్రెగ్నెన్సీ రిజల్ట్

అయితే, దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సోమవారం తన నిర్ణయం వెల్లడించింది. పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. గోవును జాతీయ జంతువుగా ప్రకటించకపోవడం వల్ల ఏ ప్రాథమిక హక్కుకు భంగం కలిగిందని కోర్టు ప్రశ్నించింది. ‘‘ఇలాంటి ఆదేశాలివ్వడం కోర్టుల పనా? బలవంతంగా ఆదేశాలిచ్చేలా ఎందుకు ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తారు? ఏ ప్రాథమిక హక్కుకు భంగం కలిగింది? మీరు కోర్టుకు వచ్చినందు వల్ల చట్టాల్ని గాలికి వదిలేయాలా?’’ అని కోర్టు పిటిషనర్లను ప్రశ్నించింది.

కాగా, గోవుల సంరక్షణ ఎంతో అవసరమని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే, ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని కోర్టు సూచించింది. పిటిషన్ దారులు తమ పిల్ ఉపసంహరించుకోవడంతో దీనిపై విచారణ ముగిసింది.

 

ట్రెండింగ్ వార్తలు