Congress President Poll: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలిగిన దిగ్విజయ్ సింగ్.. పోటీలో ఖార్గే, శశిథరూర్

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఉత్కంఠను రేకెత్తిస్తోంది. పోటీలో నిలిచేవారిలో కొత్త పేర్లు వెలుగులోకి వస్తుండటంతో ఎంత మంది బరిలో నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా మల్లిఖార్జున్ ఖార్గే బరిలో నిలుస్తున్నట్లు వార్తలు రావడంతో దిగ్విజయ్ సింగ్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో అధ్యక్ష ఎన్నికల బరిలో ఖార్గే, శశిథరూర్ నిలవనున్నారు.

Congress President Poll: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఉత్కంఠను రేకెత్తిస్తోంది. పోటీలో నిలిచేవారిలో కొత్త పేర్లు వెలుగులోకి వస్తుండటంతో ఎంత మంది బరిలో నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొన్నటి వరకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తారని, గాంధీల మద్దతు గెహ్లాట్ కే ఉందని, ఇక కాబోయే పార్టీ అధ్యక్షుడు గెహ్లాటేనని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. రాజస్థాన్ కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో గెహ్లాట్ సోనియాను కలిసి క్షమాపణలు చెప్పి, అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండటం లేదని తేల్చి చెప్పాడు.

Congress President Election-2022: ఖర్గే ఇంటికి దిగ్విజయ్ సింగ్.. స్పందించిన శశి థరూర్

గెహ్లాట్ తప్పుకోవటంతో దిగ్విజయ్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. దిగ్విజయ్ సింగ్, శశిథరూర్లు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేస్తారని, వారిలో ఒకరు అధ్యక్ష బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, రాత్రికిరాత్రే అనూహ్యరీతిలో రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖార్గే పేరు తెరపైకి వచ్చింది. గురువారం అర్థరాత్రి దాటిన తరువాత సోనియాగాంధీ ఖార్గేకు ఫోన్ లో మాట్లాడారని, అధ్యక్ష బరిలో నిలవాలని సూచించినట్లు తెలిసింది. దీంతో ఈ రోజు మధ్యాహ్నం 3గంటలకు ఖార్గే నామినేషన్ ప్రతాలు దాఖలు చేస్తారు. మరోవైపు శశిథరూర్ కూడా సాయంత్రంలోపు నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మల్లిఖార్జున్ ఖార్గే పోటీలో నిలుస్తున్నట్లు వార్తలు వస్తుండటంతో.. దిగ్విజయ్ సింగ్ బరినుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఖార్గే నివాసానికి వెళ్లిన దిగ్విజయ్ సింగ్ ఖార్గేతో కొద్దిసేపు చర్చించారు. ఈ సందర్భంగా తాను ఖార్గేకు మద్దతుగా అధ్యక్ష పదవికి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు దిగ్విజయ్ ప్రకటించారు. మల్లికార్జున ఖర్గే తనకు సీనియర్ అని.. మీరు పోటీ చేస్తే తాను బరి నుంచి తప్పుకుంటానని చెప్పానని తెలిపారు. అయితే, తాను పోటీ పడటం లేదని అన్నారని, అయితే.. అధ్యక్ష పదవికి ఖర్గే పోటీ చేయబోతున్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలను తాను చూశానని, అందుకే బరినుంచి తప్పుకున్నానని చెప్పారు. తాను ఖర్గేకు మద్దతుగా నిలుస్తానని, ఆయనపై పోటీ చేసే ఆలోచనను కూడా తాను చేయనని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు