Aryan Khan : శానిటరీ ప్యాడ్స్‌‌లో డ్రగ్స్ తీసుకెళ్లిన మహిళ!

దర్యాప్తులో ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. డ్రగ్స్ షిప్స్ లోకి ఎలా తీసుకెళ్లారనే దానిపై దర్యాప్తు చేయగా విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి.

Drugs Sanitary Pad: బాలీవుడ్ లో క్రూయిజ్ షిప్ డ్రగ్స్ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో తెలిసేందే. ఇందులో ప్రముఖ బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టు కావడంతో సంచలనం సృష్టించింది. ఇతనే కాకుండా..పలువురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అరెస్టు చేసింది. అయితే దర్యాప్తులో ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. డ్రగ్స్ షిప్స్ లోకి ఎలా తీసుకెళ్లారనే దానిపై దర్యాప్తు చేయగా విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి.

Read More : Ashish Mishra Arrest : లఖింపూర్ ఖేరి కేసులో నిందితుడు ఆశిష్‌ మిశ్రా అరెస్ట్‌

షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ స్నేహితుడు ఆర్బజ్ దగ్గర దొరికిన చరాస్ అతని షూలో దాచి ఉంచినట్లు తెలుసుకున్నారు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న..ఓ మహిళ..శానిటరీ న్యాప్ కిన్ లో దాచి ఉంచడం ద్వారా నౌకకు డ్రగ్స్ తీసుకెళ్లినట్లు ఎన్ సీబీ శనివారం వెల్లడించింది. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్టు చేసిన ఎన్సీబీ అధికారులు…శనివారం డ్రగ్ పెడ్లర్ ను అదుపులోకి తీసుకుంది.

Read More : Chennai : గుళ్లకు, ఆశ్రమాలకు వెళ్తోందని భార్యను చంపేశాడు, అనాథలైన చిన్నారులు

ఈ కేసులో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ డ్రైవర్ ను కూడా శనివారం విచారించింది. అక్టోబర్ 11వ తేదీన ఏజెన్సీ ఎదుట హాజరు కావాలని సినీ నిర్మాత ఇంతియాజ్ ఖత్రికి సమాచారం అందించారు. 2021, అక్టోబర్ 02వ తేదీన సముద్ర తీరంలో గోవాకు వెళుతున్న క్రూయిజ్ షిప్ లో ఎన్సీబీ బృందం దాడులు జరిపింది. అక్కడ రేవ్ పార్టీ జరుగుతోందని..డ్రగ్స్ సేవిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు జరిపారు. షారూఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ తో సహా…11 మందిని అదుపులోకి తీసుకుని విచారించింది.

Read More : Fixed Deposits : ఏ బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేయాలి ?

వీరిలో ముగ్గురిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆర్యన్ ఖాన్ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా..కోర్టు తిరస్కరించింది. డ్రగ్స్ ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆర్యన్ సహా ఎనిమిది మందికి కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం.. వచ్చే 3 నుంచి 5 రోజుల పాటు ఆర్యన్‌ను ఆర్థర్ రోడ్ జైలులో క్వారంటైన్ సెల్‌లో ఉంచనున్నారు.

ట్రెండింగ్ వార్తలు