Nitin Gadkari: ప్రభుత్వం సరైన టైంలో నిర్ణయాలు తీసుకోవట్లేదు: గడ్కరి ఆసక్తికర వ్యాఖ్యలు

తక్కువ ఖర్చుతో ఉత్తమమైన, నాణ్యమైన వస్తువులను తయారు చేయడంలో మనం మరింత ముందుకు రావాలి. అయితే ఈ పనిలో సమయం అనేది చాలా విలువైనదని గుర్తుంచుకోవాలి. నిజానికి సమయమే అతిపెద్ద పెట్టుబడి. కాకపోతే ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఇది చాలా పెద్ద సమస్య

Nitin Gadkari: ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడం లేదని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. చాలా కాలంగా క్రితం భారతీయ జనతా పార్టీ కీలక విభాగంలో సభ్యుడిగా ఉన్న గడ్కరికి తాజా చేసిన మార్పుల్లో స్థానం కోల్పోయారు. ఇది జరిగిన కొద్ది రోజులకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఆదివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మౌళిక సదుపాయాల రంగంలో భారత్‭కు మంచి భవిష్యత్ ఉందని, అన్ని అవకాశాల్ని అందిపుచ్చుకుని దేశాన్ని ముందుకు తీసుకెళ్లానని అన్నారు.

‘‘మీరు అద్భుతాలు చేయొచ్చు. దానికి కావాల్సిన ముడిసరుకు ఇక్కడ ఉంది. నా సలహా ఏంటంటే.. మౌళిక సదుపాయాల రంగంలో భారత్‭కు మంచి భవిష్యత్ ఉంది. మనం మంచి సాంకేతికత, మంచి నైపుణ్యం, మంచి పరిశోధన, విజయవంతమైన పని విధానాన్ని దేశంలో, ప్రపంచంలో ఎక్కడున్నా తీసుకోవాలి. తక్కువ ఖర్చుతో ఉత్తమమైన, నాణ్యమైన వస్తువులను తయారు చేయడంలో మనం మరింత ముందుకు రావాలి. అయితే ఈ పనిలో సమయం అనేది చాలా విలువైనదని గుర్తుంచుకోవాలి. నిజానికి సమయమే అతిపెద్ద పెట్టుబడి. కాకపోతే ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఇది చాలా పెద్ద సమస్య’’ అని గడ్కరి అన్నారు.

కొద్ది రోజుల క్రితం జరిగిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో భారత్ అనేక మైలురాళ్లను దాటిందని, ఎంతో విజయం సాధించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. అయితే తాజాగా గడ్కరి చేసిన వ్యాఖ్యలను పోల్చి చూస్తే ప్రధాని వ్యాఖ్యలు ఎంతమాత్రం పొంతన కుదరడం లేదు. అయితే గడ్కరి తన ప్రసంగంలో ప్రత్యేకంగా ఈ ప్రభుత్వమంటూ ఎవరి గురించి చెప్పలేదు. ప్రభుత్వం అనే పదాన్ని మాత్రమే ఆయన ఉపయోగించారు.

Raja Singh remarks: మీవాళ్లను అదుపులో ఉంచండి.. బీజేపీకి మాయావతి హెచ్చరిక

ట్రెండింగ్ వార్తలు