karnataka assembly elections 2023: కాంగ్రెస్ కి అనుకూలంగా వాట్సప్ గ్రూపుల్లో సందేశాలు పంపి చిక్కుల్లో పడ్డ టీచర్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు 200 శాతం ఉన్నాయంటూ టీచర్ల వాట్సప్ గ్రూపుల్లో మెసేజ్ షేర్ చేసిన ఓ ప్రభుత్వ టీచర్ చిక్కుల్లో పడ్డారు. కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలోని భానాపూర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమశేఖర్ హార్తి అనే వ్యక్తి టీచర్ గా పనిచేస్తున్నారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో దీనిపై అత్యుత్సాహం ప్రదర్శించారు.

karnataka assembly elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు 200 శాతం ఉన్నాయంటూ టీచర్ల వాట్సప్ గ్రూపుల్లో మెసేజ్ షేర్ చేసిన ఓ ప్రభుత్వ టీచర్ చిక్కుల్లో పడ్డారు. కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలోని భానాపూర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమశేఖర్ హార్తి అనే వ్యక్తి టీచర్ గా పనిచేస్తున్నారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో దీనిపై అత్యుత్సాహం ప్రదర్శించారు.

నిబంధనలకు విరుద్ధంగా ఓ పార్టీకి సానుకూలంగా మెసేజ్ షేర్ చేశారు. దీంతో ఈ విషయంపై స్థానిక జర్నలిస్టు ఒకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా, సోమశేఖర్ కు అధికారుల నుంచి నోటీసు అందింది. సోమశేఖర్ అసిస్టెంట్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగానూ ఉన్నారు.

కాంగ్రెస్ కు సానుకూలంగా మెసేజ్ చేసిన ఘటనపై అధికారులు మాట్లాడుతూ.. ఆ టీచర్ కర్ణాటక సివిల్ సర్వీసెస్ రూల్స్ కి నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని చెప్పారు. ఈ ఘటనతో ఉన్నతాధికారులు జిల్లాలోని అన్ని పాఠశాలలను పలు ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీకైనా సానుకూలంగా వ్యవహరిస్తూ పోస్టులు చేయకూడదని చెప్పారు.

Maheshwar Reddy: రేపటి నుంచి మహేశ్వర్ రెడ్డి పాదయాత్ర

ట్రెండింగ్ వార్తలు