Madhya Pradesh: ప్రభుత్వ అధికారిని స్టేజీపైకి పిలిచి, సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి

ఎందుకలా జరిగిందని సీఎం ప్రశ్నించగా.. సదరు అధికారి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు. దీంతో సభా వేదిక నుంచే ఆ అధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చౌహాన్ ప్రకటించారు. సస్పెండ్ అయిన ఆ అధికారి పేరు తికారాం అహిర్వార్. దిండోరి జిల్లా డీఎస్ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Madhya Pradesh: ప్రధానమంత్రి ఉజ్వల్ పథకం కింద అర్హులకు లబ్దిదారు నంబర్లు కేటాయించడంలో విఫలమైన జిల్లా అధికారిని పబ్లిక్ మీటింగులో సస్పెండ్ చేశారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. శనివారం రాష్ట్రంలోని దిండోరి జిల్లాలో నిర్వహించిన సమావేశంలో సదరు అధికారిని స్టేజిపైకి పిలిచి.. వివరణ అడిగిన ఆయన, సరైన సమాధానం రాకపోవడంతో సస్పెండ్ చేస్తున్నట్లు అందరి ముందే ప్రకటించారు.

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలకు ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద లబ్దిదారులను ఎంపిక చేసి పథకం కింద లభించే లబ్దిని అందజేస్తారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇంత మందిని ఈ పథకం కింద గుర్తించి రిజిస్టర్ చేయాలని చౌహాన్ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఇందులో భాగంగా దిండోరిలో నిర్వహించిన బహిరంగ సభలో ఈ పథకం గురించి జిల్లా సప్లై అధికారిని పిలిచి.. లబ్దిదారుల గుర్తింపుపై ప్రశ్నించారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన టార్గెట్‭ను అందుకోలేదని ఆయన సమాధానం ఇచ్చారు.

ఎందుకలా జరిగిందని సీఎం ప్రశ్నించగా.. సదరు అధికారి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు. దీంతో సభా వేదిక నుంచే ఆ అధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చౌహాన్ ప్రకటించారు. సస్పెండ్ అయిన ఆ అధికారి పేరు తికారాం అహిర్వార్. దిండోరి జిల్లా డీఎస్ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Ankita Bhandari Murder Case: పులకిత్ ఆర్య అరెస్ట్ అనంతరం తండ్రిని, సోదరుడిని పార్టీ నుంచి బహిష్కరించిన బీజేపీ

ట్రెండింగ్ వార్తలు