Agnipath Scheme: ‘అగ్నిపథ్‌’ స్కీమ్‌ను అర్థం చేసుకోండి..ఇది యువతకు, దేశానికి ప్రయోజనం చేకూర్చే పథకం : మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌..

‘అగ్నిపథ్‌’ స్కీమ్‌ను అర్థం చేసుకోండి..ఇది యువతకు, దేశానికి ప్రయోజనం చేకూర్చే పథకం అని కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌ ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు.

Agnipath Scheme: త్రివిధ దళాల్లో సైనిక నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించి అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి.విధ్వంసాలతో నిరసనకారులు విరుచుకుపడుతున్నారు. ఈ ఆందోళనలపై బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. అగ్నిపథ్ స్కీమ్ పై వస్తున్న పుకార్లను నమ్మవద్దని..స్కీమ్ ను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. యువత గురించి ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ అవకాశాన్ని యువత అర్థం చేసుకోవాలని..సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. దీంట్లో భాగంగానే కేంద్రం క్రీడలశాఖా మంత్రి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడల మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ స్పందించారు. ప్రధాని మోడీపై నమ్మకం ఉంచండీ..అగ్నిపథ్ స్కీమ్ ను అర్థం చేసుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Also read : Agnipath : అప్పుడు అన్నదాతలతో..ఇప్పుడు దేశ జవాన్లతో కేంద్రం ఆడుకుంటోంది : కేటీఆర్

సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేసిన మంత్రి రాథోడ్.. ‘ అగ్నిపథ్ స్వీమ్ దేశానికి, దేశ యువతకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని దీన్ని యువత అర్థం చేసుకోవాలని సూచించారు. ఈ పథకం నాలుగు ఏళ్లకు మాత్రమే ఉపయోగపడుతుందని ఆ తరువాత అంటే అగ్నివీరులుగా నాలుగేళ్ల సేవలు అందించాక నాలుగు ఏళ్ల తరువాత అగ్నివీర్ ఏం చేస్తాడో అంటు ప్రశ్నిస్తున్నారు ఈ స్కీమ్ ను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని సూచించారు.

ఈ స్కీమ్ తరువాత అగ్నివీరులు ఏం చేయాలని ఎంతోమంది అవగాహన లేకుండా వ్యాఖ్యానిస్తున్నారనీ..ఈ పుకార్లను నమ్మి దయచేసి ఎవరూ మోసపోకండి. కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను అర్థం చేసుకోండి అని కోరారు. ఈ అగ్నిపథ్ స్కీమ్…యువతకు, దేశానికి ప్రయోజనం చేకూర్చే పథకం అని చెప్పుకొచ్చారు. ఈ రిక్రూట్‌మెంట్‌ పథకం ద్వారా ఎక్కువ మంది సైన్యంలో చేరే అవకాశం ఉంది. అదేవిధంగా బీఎస్ఎఫ్, పోలీస్ ఇలా ఇతర సేవల్లోనూ చేరే అవకాశం ఉంది. భారతీయ ఆర్మీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీపై నమ్మకం ఉంచండి’ అని వీడియోలో వివరించారు మంత్రి రాజ్యవర్థన్‌.

Also read : # Agnipath : సికింద్రాబాద్ ఘటనతో వాల్తేరు రైల్వే డివిజన్ అప్రమత్తం..భద్రత కట్టుదిట్టం..

కాగా ..సైన్యంలో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆందోళనకారులు రైల్వే స్టేషన్లలో విధ్వంసం సృష్టిస్తున్నారు. రైళ్లకు, రైలు పట్టాలు, ఫర్నీచర్స్‌ను ధ్వంసం చేస్తున్నారు. పలుచోట్ల రైల్వే ట్రాక్‌లపై బైఠాయించి నిరసనకారులు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. గత రెండ్రోజులుగా జరిగిన ఈ ఆందోళన కార్యక్రమాలు నేడు సికింద్రాబాద్‌కు పాకాయి. స్టేషన్లలోని పలు రైళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈక్రమంలో ఆందోళన కారులను అదుపుచేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు.

Also read :Minister Kishan Reddy: ’అగ్నిపథ్‌‘ యువతకు వ్యతిరేకం కాదు.. సికింద్రాబాద్ ఘటనలో రాజకీయ ప్రమేయం..

ట్రెండింగ్ వార్తలు